/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-15-5.jpg)
Junior NTR - Sandeep Reddy Vanga : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతున్నారు. అందుకు కారణం ఓ సెన్సేషనల్ డైరెక్టర్ తో కలిసి తారక్ కనిపించడమే. అతను మరెవరో కాదు గత ఏడాది 'యానిమల్' తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా. ఈ క్రేజీ డైరెక్టర్.. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
సందీప్ రెడ్డి వంగా, తారక్ చర్చించుకుంటున్న స్టిల్ చూసిన మూవీ లవర్స్.. ఏంటీ ఈ ఇద్దరు సినిమాకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..? అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ క్రేజీ స్టార్స్ కలుసుకోవడం వెనుక సీక్రెట్ ఏమీ లేదని.. ఇద్దరిదీ కేవలం సరదా డిస్కషన్ మాత్రమేనని ఇన్‌సైడ్ టాక్.
NTR @tarak9999 & Sandeep Reddy Vanga at Mumbai 💥💥💥#Devara pic.twitter.com/T4gIk7NwDH
— Jr NTR Fan Club (@JrNTRFC) September 9, 2024
ఇదిలా ఉంటే అభిమానులు మాత్రం ఈ ఇద్దరి కాంబోలో సినిమా పడితే బాక్సాఫీస్ షేక్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో వీరి కలయికలో సినిమా ఉంటుందేమో చూడాలి. ఇక ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటించిన 'దేవర' మూవీ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు.
Ahead of Devara Trailer Launch, Man of Masses NTR Jr Meets Sandeep Reddy Vanga in Mumbai. #ManOfMasses #NTRJr #Devara #SandeepReddyVanga pic.twitter.com/26csneaAnc
— Amit Karn (@amitkarn99) September 9, 2024