/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-10-7.jpg)
Junior NTR : టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టాడు. ఈ మధ్య 'వార్ 2' షూటింగ్ కోసం తరచూ ముంబై వెళ్లి వస్తున్న తారక్.. ఈసారి 'దేవర' కోసం వెళ్ళాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 27న రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ను సెప్టెంబర్ 10 న రిలీజ్ చేయబోతున్నారు.
ఎప్పుడూ టాలీవుడ్ నుంచి ప్రమోషన్స్ మొదలెట్టే తారక్.. ఈసారి బాలీవుడ్ నుంచే దేవర ప్రమోషన్లను ప్రారంభిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేపు అక్కడ నిర్వహించనున్న ట్రైలర్ లాంచ్ కార్యక్రంలో పాల్గొననున్నాడు.
The storm has landed in Mumbai! Man of Masses, NTR Jr posing with paps, spreading cheer before the Devara trailer hits on 10th Sept! @tarak9999 #ManOfMasses #NTRJr #Devara pic.twitter.com/q3CLKGDYtN
— Mandvi Gayatri Sharma (@MandviSharma) September 8, 2024
Also Read : అలా చేసినందుకు..? శ్రద్ధాకు బాలీవుడ్ డైరెక్టర్ క్షమాపణలు.!
ఇదే ఈవెంట్‌లో హిందీ మీడియాతో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది. కాగా 'దేవర' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. వాళ్లతో కలిసి తారక్ మూవీని నార్త్ లో 'దేవర' మూవీని ప్రమోట్ చేయనున్నాడు.