Telangana: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. డిమాండ్లకు ఓకే చెప్పిన మంత్రి తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్ల డిమాండ్లు నెరవేర్చేందుకు హామీ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లు కోరిన ఎనిమిది డిమాండ్లలో ఆరింటికి మంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. By B Aravind 26 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. రాష్ట్ర సర్కార్‌తో జరిగిన చర్చలు ఫలించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్ల డిమాండ్లు నెరవేర్చేందుకు హామీ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లు కోరిన ఎనిమిది డిమాండ్లలో ఆరింటికి మంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు రాష్ట్ర సర్కార్ రెండు జీవోలను జారీ చేసింది. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల జూడాల హాస్టళ్ల నిర్మాణానికి జీవోను విడుదల చేసింది. Also Read: ‘కల్కి’ దెబ్బకు ‘సలార్’ రికార్డ్స్ బ్రేక్..! కాకతీయ మెడికల్ కాలేజీలో రహదారుల పునరుద్ధరణ కోసం నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో సహా.. కాకతీయ యూనివర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది. అలాగే ఉస్మానియా వసతి భవానాలు, రోడ్లకు రూ.121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి 79.50 కోట్లు, అలాగే కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. Also Read: రేపే బైడెన్ – ట్రంప్ మధ్య డిబేట్.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ #telugu-news #telangana-news #junior-doctors-strike మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి