Group-1: తప్పతాగి గ్రూప్ 1 పరీక్ష విధులకు హాజరైన ఉద్యోగి.. చివరికి నిన్న తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగగా.. కరీంనగర్ జిల్లా జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల సెంటర్‌లో ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. By B Aravind 10 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఓ పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ప్రభుత్వ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో చివరికి ఆయన్ని పోలీసులు అప్పగించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మీర్జా పర్వేజ్ బేగ్ అనే ఉద్యోగికి.. తిమ్మపూర్‌లో ఉన్న జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలోని సెంటల్‌లో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్‌గా డ్యూటీ కేటాయించారు. Also read: వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్ పెట్టాడు.. చివరికీ ఆదివారం ఉదంయ పరీక్ష ప్రారంభం అయ్యే టైమ్‌కి అప్పటికే ఫుల్‌గా మద్యం తాగి పరీక్ష కేంద్రానికి వచ్చాడు మీర్జా పర్వేజ్. మద్యం మత్తులో తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు గదుల్లోకి వెళ్లగానే బయటకు వచ్చిన మీర్జా.. పక్కనే ఉన్న వైన్స్ షాప్‌లో బీరు కొనగోలు చేసి రోడ్డు పక్కన తాగుతూ కనిపించాడు. పోలీసులు వెంటనే అతడిని పట్టుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతడికి బ్రీత్ అలైజర్ టెస్ట్ నిర్వహించగా.. 173 శాతం ఆల్కహాల్ పాజిటివ్ వచ్చింది. ఆదివారం ఉదయం పరీక్ష ప్రారంభ సమయానికి.. అప్పటికే మద్యం తాగి సెంటర్‌కు చేరుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన తోటి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఐడెంటిఫికేషన్ ఆఫీసర్‌గా అభ్యర్థులు సెంటర్‌లోకి వెళ్లేవరకే తన డ్యూటి అని.. డ్యూటీ అయిపోయిన తర్వాతే బయటకు వచ్చానంటూ పోలీసులతో వాదించి గొడవపడ్డాడు. చివరికి రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న మరో ఉద్యోగితో పాటు కుటుంబ సభ్యులు వచ్చి అతడిని స్టేషన్ నుంచి తీసుకెళ్లారు. Also Read: ముగిసిన చేప ప్రసాదం పంపిణీ.. ఎంతమంది వచ్చారంటే #telugu-news #karimnagar #group-1 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి