/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-36-1-jpg.webp)
Viral Video : ఐపీఎల్ 2024(IPL 2024) లో భాగంగా ఆదివారం రాత్రి లక్నో(Lucknow) లోని ఎకనా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సమయంలో లక్నో బ్యాటర్ స్టాయినిస్ కొట్టి సిక్స్‌ను బౌండరీ లైన్ బయట ఉన్న బాల్ బాయ్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ సమయంలో మూడో ఓవర్‌లోని ఐదో బంతిని కేకేఆర్ జట్టు బౌలర్ వైభవ్ అరోరా షార్ట్ బాల్ వేశాడు. క్రీజులో ఉన్న మార్కస్ స్టాయినిస్ వికెట్ల వెనుక నుంచి సిక్స్ కొట్టాడు. వేగంగా వచ్చిన ఆ బంతిని బౌండరీ లైన్ బయట ఉన్న బాల్ బాయ్ అథర్వ్ గుప్తా క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ అనంతరం స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. ఇది జరిగినప్పుడు డకౌట్‌లో ఉన్న లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్.. బౌండరీ బయట క్యాచ్ అందుకున్న బాల్ బాయ్ ను చప్పట్లు కొడుతూ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ క్యాచ్ పట్టిన సదరు బాల్ బాయ్‌ను కామెంటేటర్స్ కూడా అభినందించారు.
మ్యాచ్ అనంతరం బాల్ బాయ్ అథర్వ్ గుప్తాను కలిసి ప్రశంసించాడు జాంటీ రోడ్స్(Jonty Rhodes). గతంలో ఓ టీ20 మ్యాచ్ సందర్భంగా జాంటీ ఇచ్చిన సూచనల ప్రకారమే ఇప్పుడు క్యాచ్‌ను అందుకొన్నట్లు బాల్ బాయ్ గుప్తా చెప్పాడు. గుర్తుంచుకున్నందుకు జాంటీ సంతోషపడి ధన్యవాదాలు చెబుతూనే ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఫీల్డింగ్, క్యాచ్‌లకు సంబంధించి పలు సూచనలు చేశాడు. ఈ వీడియోను ఐపీఎల్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
𝗧𝗵𝗶𝘀 𝗜𝘀 𝗪𝗵𝗼𝗹𝗲𝘀𝗼𝗺𝗲! ☺️
What happenes when Jonty Rhodes interviews Atharw - the Ball Kid who took that fine catch 👏 👏 - By @ameyatilak #TATAIPL | #LSGvKKR | @LucknowIPL | @JontyRhodes8 pic.twitter.com/l3hUdhepGi
— IndianPremierLeague (@IPL) May 6, 2024
Also Read : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో రెండు చిన్న దేశాల కెప్టెన్లు…