Jonnavithula : ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సినీ గేయ రచయిత.. ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు!

మరో తెలుగు సినీ ప్రముఖుడు, గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. గురువారం విజయవాడ సెంట్రల్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చేవేళ్ల నుంచి నటి దాసరి సాహితి సైతం పోటీకి సిద్ధమైన విషయం తెలిసిందే.

New Update
Jonnavithula : ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సినీ గేయ రచయిత.. ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు!

AP Assembly : లోక్ సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో పలువురు సినీ తారలు ఎన్నికలు బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే నార్త్ ఇండస్ట్రీ(North Industry) నుంచి ప్రముఖ నటులు బీజేపీ, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంపీ, ఎమ్మెల్యేగా పలువురు సినీ తారలు తమ అదృష్టాన్ని పరిక్షించునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ‘పొలిమేర’ సినిమా ఫేమ్, నటి దాసరి సాహితి(Dasari Sahithi) స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా గురవారం ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Dasari Sahithi : ఎంపీగా పోటీ చేస్తున్న తెలుగు నటి.. నామినేషన్‌ దాఖలు!

విజయవాడ సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ గా..
ఈ మేరకు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు(Jonnavithula Ramalingeswara Rao) విజయవాడ సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పలు చిత్రాలకు 600కు పైగా పాటలు రాసిన జొన్నవిత్తుల.. పేరడీ సాంగ్స్ తో పాపులర్ అయ్యారు. గతంలో ఆయన బీజేపీలో చేరి కొంతకాలానికి బయటికొచ్చారు. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక తెలుగు శంఖారావం పేరుతో తెలుగు భాష మీద పాటలు రాశారు. 2005లో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా పెళ్ళాం పిచ్చోడు అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. తెలంగాణ విడిపోయినప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవనిర్మాణ దీక్షకై ప్రత్యేక గీతం రాయగా.. వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు