వివాహ బంధంతో ఒక్కటైన ఐఏఎస్, ట్రైనీ ఐపీఎస్.. సింపుల్ గా రిజిస్ట్రార్ మ్యారేజ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట నిరాడంబరంగానే వివాహం చేసుకున్నారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్ లు.. మచిలీ పట్నం కలెక్టరేట్ లోని ఛాంబర్ లో జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో ఎంతో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దండలు మార్చుకుని రిజస్టర్ మ్యారేజ్ తో ఒక్కటయ్యారు. కొత్త జంటలకు కలెక్టర్ రాజా బాబా, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలిపారు. By E. Chinni 09 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ Scrolling New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన యంగ్ ఐఏఎస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట నిరాడంబరంగానే వివాహం చేసుకున్నారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్ లు.. మచిలీ పట్నం కలెక్టరేట్ లోని ఛాంబర్ లో జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో ఎంతో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దండలు మార్చుకుని రిజస్టర్ మ్యారేజ్ తో ఒక్కటయ్యారు. కొత్త జంటలకు కలెక్టర్ రాజా బాబా, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలిపారు. వివాహం అనంతరం ఈ నూతన దంపతులు గుడ్ల వల్లేరు మండలం వేమవరంలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. రాజస్థాన్ కు చెందిన దేవేంద్రకుమార్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు. అపరాజిత సింగ్ ది కూడా రాజస్థాన్ కాగా.. ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణిగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందని మరో యువ ఐఏఎస్ ల జంట వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వేడుక తిరుపతిలో జరిగింది. ఈ పెళ్లికి బంధు మిత్రులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. నాగలక్ష్మి 2012 ఐఏఎస్ బ్యాచ్ ఐఏఎస్ కాగా నవీన్‌కుమార్ 2019 ఐఏఎస్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నవీన్‌కుమార్ ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. #andhra-pradesh #krishna-district #joint-collector-aparajita-singh #trainee-ips-devendra-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి