IDBI Jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త.. ఐడీబీఐ బ్యాంక్ లో ట్రైనింగ్ తో పాటు జాబ్స్.. వివరాలివే!

ఐడీబీఐ...ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 600 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పరీక్ష, ఇంటర్వ్యూలతో రిక్రూట్ జరుగుతుంది. ఇందులో సెలక్ట్ అయిన వారు ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. అందులో రాణించినవారిని విధుల్లోకి చేర్చుకుంటారు. కోర్సులో ప్రతి నెలా స్టైఫెండ్ కూడా ఇస్తారు. అంతేకాదు ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి 6.5లక్షలు వేతనంగా చెల్లిస్తారు.

New Update
TS DSC : జిల్లాల వారీగా డీఎస్సీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే..!!

IDBI Recruitment 2023: బ్యాంకులు పీవో ఉద్యోగాలు ఎక్కువగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (PGDBF)ద్వారా భర్తీ చేస్తుంటారు. అయితే బ్యాంకుల్లో కొన్ని ప్రత్యేక సేవలందించేందుకు సాధారణ గ్రాడ్యుయేట్లకు ఉండే ప్రావీణ్యం సరిపోదు. వీటికోసం ఏడాదికోర్సుతో కూడిన ఉద్యోగాలకు బ్యాంకులు విడిగా ప్రకటనలు రిలీజ్ చేస్తుంటాయి. తాజా గ్రాడ్యుయేట్లు వయస్సు తక్కువ ఉన్నవారు ఈ విధానంలో చేర్చేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇలా అవకాశం వచ్చినవారు పీజీ డిప్లొమా తర్వాత ఉద్యోగం చేస్తూనే మరో ఏడాది కోర్సు ఆన్ లైన్ ద్వారా పూర్తి చేస్తారు. అనంతరం ఎంబీఏ పట్టా అందుకే ఛాన్స్ కూడా ఉంటుంది. నియామకానికి ముందు పరీక్షను నిర్వహిస్తారు. అందులో అర్హులను మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ రెండింటిలో ప్రతిభ కనబర్చిన అభ్యర్తులను కోర్సులోకి తీసుకుంటారు.

ఇది కూడా చదవండి: మహిళా ఎంపీతో శశిథరూర్‌.. ఫొటోలు వైరల్‌..! అసలేం జరిగిందంటే?

ఆన్ లైన్ విధానం ద్వారా పరీక్ష మొత్తం 200మార్కులకు ఉంటుంది. ప్రతిప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. సమయం 2గంటలు. సమాధానం తప్పుగా పేర్కొంటే పావు మార్కు తగ్గిస్తారు. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ ప్రెటేషన్ లో 60 ప్రశ్నలు, ఇంగ్లీష్ 40 ప్రశ్నలు, క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో 40 ప్రశ్నలు, జనరల్, ఎకానమీ బ్యాంకింగ్ అవేర్ నెస్ విభాగంలో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. వీటిని ఆబ్జెటివ్ రూపంలో అడుగుతారు.

ఇందులో కనీస మార్కులు పొందినవారిని ఇంటర్వ్యూకి సెలక్ట్ చేస్తారు. ఇందులో మెరిట్, రిజర్వేషన్, విభాగాలవారీగా జాబితాను సిద్దం చేస్తారు. ఇంటర్వ్యూలో 100మార్కులు ఉంటాయి. ఇందులో 50 మార్కులు తప్పనిసరిగా పొందాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దివ్యాంగులు 45 మార్కులు పొందాలి. ఇలా అర్హత సాధిస్తే...ఫైనల్ కు సెలక్ట్ అవుతారు.

కోర్సులో ప్రతినెలా రూ. 5వేల చొప్పున మొదటి ఆరు నెలలు చెల్లిస్తారు. తర్వాత నెలకు రూ. 15వేల చొప్పున ఇంటర్న్ షిప్ లో ఇస్తారు. చివరి 4 నెలలు బ్యాంకులో వ్రుత్తిగత ట్రైనింగ్ ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేస్తే అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో ఏడాదికి రూ. 6.5లక్షల వేతనం చెల్లిస్తారు. అలవెన్సులు కూడా ఉంటాయి.

ఇది కూడా చదవండి: రోహిత్‌ తీసుకోబోతున్న ఈ నిర్ణయం టీమిండియా కొంపముంచనుందా? ఈ టైమ్‌లో ఇలా చేయడం కరెక్టేనా?

ఖాళీలు: 600
రిజర్వ్డ్ 243,
ఓబీసీ 163,
ఎస్సీ 90,
ఎస్టీ 45,
ఈడబ్య్లుఎస్ 60

విద్యార్హత:
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.

వయస్సు :
ఆగస్టు 31,2023నాటికి 20 నుంచి 25ఏళ్లలోపు ఉండాలి.

ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు.

ఆన్ లైన్ పరీక్ష తేదీ: అక్టోబర్ 20

తెలుగురాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్ లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, విజయవాడ.
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.

దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు రూ. 200, మిగిలినవారు 1000చెల్లించాల్సి ఉంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు