TS Exams: ఎన్నికల ఎఫెక్ట్.. ఆ పరీక్ష వాయిదా!
తెలంగాణలో పాలీసెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ను అధికారులు వాయిదా వేశారు. వాస్తవానికి ఈ పరీక్ష మే 17న జరగాల్సి ఉండగా.. అదే నెల 24కు వాయిదా వేశారు. ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను అధికారులు వాయిదా వేశారు.
తెలంగాణలో పాలీసెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ను అధికారులు వాయిదా వేశారు. వాస్తవానికి ఈ పరీక్ష మే 17న జరగాల్సి ఉండగా.. అదే నెల 24కు వాయిదా వేశారు. ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను అధికారులు వాయిదా వేశారు.
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. మరో 5348 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్య శాఖలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
2025వ ఏడాది గానూ హెచ్-1బీ వీసాలను దరఖాస్తు చేసుకునేందుకు ప్రాథమిక గడువు ఈ నెల 22తో ముగియనుందని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ చెప్పింది. అప్లఐ చేసుకోవాలనుకునే అభ్యర్ధులు త్వరపడాలని సూచించింది.
సింగరేణిలో ఉన్న పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం సింగరేణిలో మొత్తం 327 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వివరించారు.
యూపీఎస్ సీ సివిల్ సర్విసెస్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 26న జరగాల్సిన ప్రిలిమ్స్ జూన్ 16కు వాయిదా వేశారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష మే 26న జరగనుండగా జూన్ 16న నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.
ఏపీ నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. 761 ఉద్యోగాలకుగానూ మార్చి 19న కాకినాడలోని పీ.ఆర్. కాలేజీలో ఉదయం 9 గంటలనుంచి జాబ్ మేళా నిర్వహించనున్నారు. పది నుంచి పీజీ వరకూ అర్హతలు, శాఖలను బట్టి జీతభత్యాలు చెల్లించనున్నారు.
టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు శిక్షణ ఇవ్వనుండగా మార్చి 12 నుంచి 26 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత నోటిఫికేషన్లో 503 పోస్టులకు 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి 563 పోస్టులకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.