🔴Live Breakings: తెలంగాణలో జపాన్ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సీయూఈటీ పీజీ 2025 ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు exams.nta.ac.in లేదా exams.nta.ac.in/CUET-PG/లో చెక్ చేసుకోవచ్చు. ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ కీలో సమాధానం తప్పుగా ఉందని భావిస్తే అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేయవచ్చు.
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. https://bse. ap. gov. in, https://apopenschool. ap. gov. in/ ద్వారా తెలుసుకోవచ్చు.
మంళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన సాయి చైతన్య ఆల్ ఇండియా 68ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి కానిస్టేబుల్, తల్లి గవర్నమెంట్ టీచర్. 5సార్లు ఫెయిల్ అయినా పట్టువదలకుండా సాయి ఆరో సారి సక్సెస్ అయ్యాడు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగిసింది. రేపు రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు తిరిగి రానుంది. ఈ పర్యటనలో దాదాపు 12 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తద్వారా 30 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను వారం రోజులు సమయం ఇవ్వనున్నారు. ఇక ఇంటర్ అడ్వాన్సడ్, సప్లిమెంటరీ పరీక్షలను మే 22 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులను తమ ఫలితాలను tgbie.cgg.gov.in వెబ్సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ ఫోన్లో కూడా రానున్నాయి.