3,883 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఇదే నాగ్‌పుర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 58వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 3,883 ఖాళీలను భర్తీచేయనున్నారు. By Seetha Ram 03 Nov 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! మొత్తం 3,883 ఖాళీల భర్తీ దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 58వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ వదిలింది. దీని ద్వారా మొత్తం 3,883 ఖాళీలను భర్తీ చేయనుంది. అందులో పోస్టుల కేటాయింపు కూడా ఇచ్చింది. ఐటీఐ-2498, నాన్ ఐటీఐ-1385 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు! ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, మెకానిక్, టర్నర్, ఎలక్ట్రీషియన్, బాయిలర్ అటెండెంట్, కార్పెంటర్, ఎలక్ట్రోప్లేటర్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ మేసన్, ఫౌండ్రీమ్యాన్ తదితర ట్రేడ్‌లు ఉన్నాయి. ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ ఐటీఐ, నాన్ ఐటీఐ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నాన్-ఐటీఐ కేటగిరీకి అభ్యర్థులు 50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. అదే సమయంలో ఐటీఐ అభ్యర్థులు 50 మార్కులతో పదోతరగతితో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు. నాన్-ఐటీఐ కేటగిరీ అభ్యర్థులకు పదోతరగతి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అదే సమయంలో ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా 21.11.2024లోగా దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా 592 ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖల్లో భర్తీ చేయనున్నారు. ఈ మొత్తం పోస్టుల్లో ఏపీలో 9 చోట్ల, తెలంగాణలో 7 చోట్ల ఖాళీలు ఉన్నాయి. #jobs #latest-jobs-in-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి