నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBIలో 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్! నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రకటించారు. కస్టమర్ల కోసం మరో 600 కొత్త శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. By srinivas 06 Oct 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి SBI JOBS: నిరుద్యోగులకు ప్రభుత్వరంగ బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' గుడ్ న్యూస్ చెప్పింది. ఈ యేడాది 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. సాధారణ బ్యాంకింగ్ అవసరాలు, సాంకేతికంగా బ్యాంకులను బలోపేతం చేసేందుకు మరిన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. అంతేకాదు దేశవ్యాప్తంగా 22,542 శాఖలుండగా ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మరో 600 శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా.. ఈ మేరకు ఎస్బీఐలోని వివిధ భాగాల్లో 1500 మంది సాంకేతిక నిపుణుల నియామకాలను చేపట్టాలని నిర్ణయించినట్లు శ్రీనివాసులు తెలిపారు. 'సాధారణ బ్యాంకింగ్‌తోపాటు సాంకేతిక పరంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. మార్చి 2024 నాటికి 2,32,296 మంది సిబ్బంది ఉన్నారు. అయితే మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా 8 నుంచి 10వేల ఉద్యోగులు కావాలి. డేటా సైంటిస్టు, డేటా ఆర్కిటెక్టు, నెట్‌వర్క్ ఆపరేటర్లతో సహా మరిన్ని విభాగాల్లో నియామకాలు చేపట్టబోతున్నామని తెలిపారు. #sbi #jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి