డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు.. మరికొద్ది రోజులే ఇండియన్ రైల్వేలో ఎన్టీపీసీ (గ్రాడ్యుయేట్) ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 8113 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబరు 13 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. By Seetha Ram 06 Oct 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి RRB NTPC Jobs: ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 2024 నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 8113 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, గూడ్స్ రైలు మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జోన్లవారీగా ఖాళీలు.. సికింద్రాబాద్- 478, అహ్మదాబాద్- 516, అజ్మేర్- 132, బెంగళూరు- 496, భోపాల్- 155, భువనేశ్వర్- 758, బిలాస్‌పూర్- 649, ఛండీగఢ్- 410, చెన్నై- 436, గోరఖ్‌పూర్- 129, గువాహటి- 516, జమ్మూ, శ్రీనగర్- 145, కోల్‌కతా- 1382, మాల్దా- 198, ముంబయి- 827, ముజఫర్‌పూర్- 12, ప్రయాగ్‌రాజ్- 227, పాట్నా- 111, రాంచీ- 322, సిలిగురి- 40, తిరువనంతపురం- 174 ఖాళీలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: ఎస్బీఐలో 1,511 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. లాస్ట్ డేట్ ఇదే విద్యార్హత: ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కాగా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క కమ్ టైపిస్ట్ పోస్టులపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిగ్రీతోపాటు ఇంగ్లిష్ లేదా హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి. వయోపరిమితి: 01.01.2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయస్సు వారు అప్లై చేసుకోవాలి. నిబంధనల ప్రకారం.. వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఇది కూడా చదవండి: టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త! ఎంపిక: స్టేజ్-1, స్టేజ్-2 ఆన్‌లైన్ ఎగ్జామ్స్, టైపింగ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్.. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇది కూడా చదవండి: రైల్వేలో 3115 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..! పూర్తి వివరాలకు ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. #railway-jobs #latest-jobs-in-telugu #rrb-ntpc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి