/rtv/media/media_files/2025/09/23/indian-railways-2025-09-23-17-29-12.jpg)
Indian Railways
రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూ్స్.. దేశవ్యాప్తంగా ఉన్న రకరకాల రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6565 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునే వారు జూన్ 30 నుండి rrbapply.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి జూలై 29 వరకు టైమ్ ఉంది. అయితే, ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, పరీక్ష ఎలా ఉంటుంది, ఫీజు ఎంత, రిజర్వేషన్ రూల్స్ ఏంటి అనే పూర్తి నోటిఫికేషన్‌ను జూన్ 29న విడుదల చేస్తారు.
ఈ మొత్తం 6565 ఉద్యోగాలలో.. టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 323 ఉన్నాయి, అలాగే టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులు చాలా ఎక్కువగా అంటే 6242 ఉన్నాయి. ముంబై, చెన్నై, న్యూఢిల్లీ లాంటి పెద్ద పెద్ద రైల్వే జోన్లలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. మన దేశంలో ఎక్కడైనా సరే ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నవారెవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి దేశంలోని వివిధ రైల్వే జోన్లలో పోస్టింగ్ ఇస్తారు.
18 ఏళ్లు నిండి
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే పదో తరగతి పాసై ఉండాలి. దాంతో పాటు ఐటీఐ (ITI) సర్టిఫికేట్ కూడా ఉండాలి. అప్రెంటిస్‌షిప్ చేసిన వారు కూడా కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకైతే డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారు కూడా అర్హులే. అప్లై చేసేవారికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. గ్రేడ్-1 సిగ్నల్ ఉద్యోగాలకు 33 ఏళ్ల వరకు, గ్రేడ్-3 ఉద్యోగాలకు 30 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం కేటగిరీల వారీగా వయస్సులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌లో అప్లై చేయడం చాలా తేలిక. మొదట రైల్వే బోర్డు వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ అప్లై లింక్‌పై క్లిక్ చేసి.. మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఆధార్ వివరాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు వచ్చే ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అవ్వాలి. మీ పర్సనల్ డీటెయిల్స్, చదువు వివరాలు అన్నీ తప్పులు లేకుండా నింపాలి. అడిగిన సర్టిఫికేట్లను కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఆన్‌లైన్‌లోనే ఫీజు కట్టాలి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుని ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. చివరగా ఆ అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసి దాచుకోవాలి. ఫామ్ నింపేటప్పుడు తప్పులు పోకుండా ఉండాలంటే.. అప్లై చేసే ముందే పూర్తి నోటిఫికేషన్‌ను ఒకసారి బాగా చదువుకోవడం మంచిది.
Follow Us