NEET Exam : నీట్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి.. సింపుల్ టిప్స్ ఇవే!

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రాసి, డాక్టర్ అవ్వాలనేది లక్షలాది మంది విద్యార్థుల కల. అయితే, NEET అనగానే అమ్మో చాలా కష్టం అని భయపడిపోతుంటారు. కానీ, సరైన ప్లాన్ ఉంటే ఈ పరీక్షను సులువుగా క్రాక్ చేయొచ్చు. 

New Update
neet exam

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రాసి, డాక్టర్ అవ్వాలనేది లక్షలాది మంది విద్యార్థుల కల. అయితే, NEET అనగానే అమ్మో చాలా కష్టం అని భయపడిపోతుంటారు. కానీ, సరైన ప్లాన్ ఉంటే ఈ పరీక్షను సులువుగా క్రాక్ చేయొచ్చు. 

యుద్ధానికి వెళ్లేముందు శత్రువు బలం ఏంటో తెలియాలి కదా! అలాగే NEET రాసే ముందు అసలు సిలబస్ ఏముందో పూర్తిగా తెలుసుకోవాలి. ఏ చాప్టర్ నుండి ఎక్కువ మార్కులు వస్తున్నాయో గమనించి, వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి. రోజుకి 10-12 గంటలు పుస్తకాల ముందు కూర్చోవడం ముఖ్యం కాదు, కూర్చున్న 6-8 గంటలు ఎంత శ్రద్ధగా చదివామనేది ముఖ్యం. రోజువారీ, వారపు లక్ష్యాలను పెట్టుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ... మూడింటికీ సమానంగా టైమ్ కేటాయించండి.

బయాలజీ :ఇది మార్కులు తెచ్చిపెట్టే సబ్జెక్ట్. డయాగ్రామ్స్ వాటి భాగాలను బాగా గుర్తుపెట్టుకోండి.
కెమిస్ట్రీ : ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈక్వేషన్స్, ఇన్-ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫార్ములాలను ఒక బుక్‌లో రాసుకుని రోజూ రివైజ్ చేయండి.
భౌతికశాస్త్రం: చాలామంది దీనికే భయపడతారు. ఇక్కడ బట్టీ పడితే లాభం లేదు. కాన్సెప్ట్ అర్థం చేసుకుని, ఫార్ములాలు ఎలా అప్లై చేయాలో ప్రాక్టీస్ చేయాలి. 

మాక్ టెస్ట్‌లు రాయండి

చదవడం ఎంత ముఖ్యమో, ప్రాక్టీస్ చేయడం అంతకంటే ముఖ్యం. గత 10-15 సంవత్సరాల NEET ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయండి.  వారానికి కనీసం ఒకటి లేదా రెండు మాక్ టెస్ట్‌లు రాయండి. దీనివల్ల టైమ్ మేనేజ్‌మెంట్ అలవడుతుంది. మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చాయనేది కాదు, ఎక్కడ తప్పులు పోయాయో చూసుకోవాలి. ఆ తప్పులను ఒక మిస్టేక్ బుక్ లో రాసుకుని, మళ్లీ ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి.

NEET అనేది ఒకే రోజులో సాధించేది కాదు. రోజువారీ పట్టుదల, కష్టపడే తత్వమే మిమ్మల్ని విజేతగా నిలబెడతాయి. నేను సాధించగలను అనే నమ్మకంతో ముందడుగు వేయండి. ఆల్ ది బెస్ట్!

Advertisment
తాజా కథనాలు