రైల్వేలో 8,113 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు.. కొద్ది గంటలే సమయం

RRB ఇటీవల 8,113 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ) గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది.

New Update
Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన!

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఇటీవల నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 8,113 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

గ్రాడ్యుయేట్ కేటగిరీలోచీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, గూడ్స్ రైలు మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఖాళీలను భర్తీ చేస్తోంది. అయితే ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ మరో 24 గంటల్లో ముగియనుంది. అందువల్ల ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. 

ఇది కూడా చదవండి: ఎస్బీఐలో 1,511 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. లాస్ట్ డేట్ ఇదే

గ్రాడ్యుయేట్ పోస్టులు

కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ - 1,736 పోస్టులు
స్టేషన్ మాస్టర్ - 994 పోస్టులు
గూడ్స్ రైలు మేనేజర్ - 3,144 పోస్టులు
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ - 1,507 పోస్టులు
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 732 పోస్టులు ఉన్నాయి.

ఇది కూడా చూడండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!

జోన్లవారీగా ఖాళీలు..

సికింద్రాబాద్- 478, అహ్మదాబాద్- 516, అజ్మేర్- 132, బెంగళూరు- 496, భోపాల్- 155, భువనేశ్వర్- 758, బిలాస్‌పూర్- 649, ఛండీగఢ్- 410, చెన్నై- 436, గోరఖ్‌పూర్- 129, గువాహటి- 516, జమ్మూ, శ్రీనగర్- 145, కోల్‌కతా- 1382, మాల్దా- 198, ముంబయి- 827, ముజఫర్‌పూర్- 12, ప్రయాగ్‌రాజ్- 227, పాట్నా- 111, రాంచీ- 322, సిలిగురి- 40, తిరువనంతపురం- 174 ఖాళీలు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: డిప్యూటీ కలెక్టర్​ పీవీ సింధు.. ఆన్‌డ్యూటీ మరో ఏడాది పొడిగింపు

విద్యార్హత

ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కాగా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క కమ్ టైపిస్ట్ పోస్టులపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిగ్రీతోపాటు ఇంగ్లిష్ లేదా హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి. 

వయోపరిమితి

ఇది కూడా చూడండి: సల్మాన్‌ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్

01.01.2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయస్సు వారు అప్లై చేసుకోవాలి. నిబంధనల ప్రకారం.. వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 20.10.2024.

పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment