Jobs:నిరుద్యోగులకు అలర్ట్..జనగాంలో జాబ్ మేళా నిరుద్యోగుల కోసం వరుసగా తెలంగాణలో జాబ్ మేళాలు జరుగుతున్నాయి. ఈ వరుసలో ఫిబ్రవరి 17న జనగాంలో జాబ్ మేళా జరగనుంది. ఇందులో భారీ జీతంతో ఉద్యోగాలున్నాయి. By Manogna alamuru 15 Feb 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి దేశంలో ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు ప్రైవేటు కంపెనీలు పోటీ పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో యువకుల ఇవిన్నీ దృష్టి పెట్టాయి. నగరాల్లో ప్రైవేటు కంపెనీల్లో జరిగే రిక్రూట్ మెంట్‌లకు చాలా మంది గ్రామాల నుంచి వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వారికోసం కంపెనీలే గ్రామాలకు వెళుతున్నాయి. ఒక్కో జిల్లాలో ఒక్కో తేదీలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో పెద్ద చదువులు చదివిన వారికి మాత్రమే కాక ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాయి. జనగాంలో జాబ్ మేళా... గ్రామాల్లో ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న జనగాంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఉపాధి కార్యాలయంలో దీన్ని నిర్వహిస్తున్నారు. H1HR సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని పలు రకాల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్ చదివి భాషా నైపుణ్యం కలిగినటువంటి యువతి యువకులకు టెలికాలర్ ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి.50 దాకా ఉద్యోగాలు ఇందులో భర్తీ చేయనున్నారు. దానితోపాటు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ 100 పోస్టులు, హోటల్ మేనేజ్మెంట్ లో 20 పోస్టులు, ఐటిఐ చదివిన వారికి టెక్నీషియన్ పోస్టులు 10 ఖాళీలు, దాంతో పాటూ టూ వీలర్ బైక్‌తో పాటూ లైసెన్స్ ఉన్నవారికి 20 డెలివరీ పికప్ జాబ్స్ కూడా ఉన్నాయి. జీతం, ప్రదేశం.. పైన చెప్పిన ఉద్యోగాలు అన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి. వీటికి అర్హతను బట్టి 25 నుంచి 30 వేలకు జీతం ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు 17 ఫిబ్రవరి న ఉదయం 10:30 వరకు జనగాం జిల్లా కేంద్రంలోని ఉపాధి కార్యాలయానికి బయోడేటా ఫామ్ తో పాటు పాస్ పోర్ట్ సైజు ఫోటోలను , ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్లు, విద్యార్హత సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి సి.హెచ్ ఉమారాణి తెలియజేశారు .ఇతర వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 7997973327. #telangana #jobs #mela #janagam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి