JK Union Territory Status: జమ్ము రాష్ట్ర హోదాను ఎప్పుడు పునరుద్దరిస్తారు.... కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్న....! జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం కేవలం తాత్కాలిక చర్యేనని కేంద్రం పేర్కొంది. భవిష్యత్ లో జమ్ముకు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం వెల్లడించింది. జమ్ములో అన్ని పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. జమ్ములో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది. By G Ramu 29 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి JK Union Territory Status: జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం కేవలం తాత్కాలిక చర్యేనని కేంద్రం పేర్కొంది. భవిష్యత్ లో జమ్ముకు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం వెల్లడించింది. జమ్ములో అన్ని పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. జమ్ములో ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది. విచారణ సందర్బంగా సుప్రీం కోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. జమ్ము కశ్మీర్ పై ఈ తాత్కాలిక చర్య ఎంత కాలం అమలులో వుంటుందని ప్రశ్నించింది. జమ్ములో ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని ఈ సందర్బంగా ధర్మాసనం అడిగింది. దీనికి కేంద్రం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహత వివరణ ఇచ్చారు. అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కేంద్ర చర్యలు తీసుకుంటోందని చెప్పారు. జమ్ము కశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయానికి అనుమతి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు కొంత ఆసక్తిగా కనిపించింది. అయితే జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరణకు ఎంత సమయం పడుతుందని కేంద్రం భావిస్తుందో చెప్పాలని ధర్మాసనం అడిగింది. జమ్ములో ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు పునరుద్దరిస్తారని ప్రశ్నించింది. అంతకు ముందు జమ్ము కశ్మీర్ లో 370 ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉందని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహత అన్నారు. రాజ్యాలు దేశంలో విలీనం అయిన సమయంలో అవి తమ విశేష అధికారాలను కోల్పోతాయని ఆయన వాదనలు వినిపించారు. అనంతరం ఆర్టికల్ 35 ఏ (Article 35 A) కశ్మీరేతరుల హక్కులను దూరం చేసిందరి సీజేఐ వెల్లడించారు. దీని ద్వారా కశ్మీర్ లో భూములు కొనుగోలు చేసే హక్కును వారు కోల్పోయారన్నారు. Also Read: ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్…. ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు….! #supreme-court #jammu-kashmir #article-370 #abrogation #jk-union-territory-status #article-35-a మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి