Dangerous Shot: జస్ట్ మిస్..లేకపోతే అంపైర్ అవుట్..జితేష్ స్ట్రోక్ అలాంటిది మరి! టీమిండియా-ఆసీస్ జట్ల మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో పెద్ద ప్రమాదం తప్పింది. ఇషాన్ కిషన్ స్థానంలో జట్టులోకి వచ్చిన జితేష్ బలంగా కొట్టిన షాట్ కి బంతి అంపైర్ వైపుగా దూసుకుపోయింది. అంపైర్ చేతులతో అడ్డు కుని బాల్ వేగాన్ని తగ్గించడంతో పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డాడు. By KVD Varma 02 Dec 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Dangerous Shot: టీ20 సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 4 మార్పులు చేసింది, ఇందులో ఇషాన్ కిషన్ స్థానంలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మకు అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో జితేష్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో ఒక షాట్ అందరికీ షాక్ ఇచ్చింది. భారత్-ఆస్ట్రేలియా(India vs Australia) జట్ల మధ్య జరిగిన నాలుగో టీ20(T20) మ్యాచ్‌లో పెద్దగా అలరించే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురవకపోయినా మ్యాచ్‌లో కొన్ని అద్భుతమైన విషయాలు కనిపించాయి. రింకూ సింగ్, జితేష్ శర్మ, యశస్వి జైస్వాల్ అద్భుతమైన షాట్లు కొట్టగా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల స్టంప్‌లను ఎగరగొట్టి భారత అభిమానులకు ఆనందాన్ని ఇచ్చారు. వీటన్నిటి మధ్యలో ఒక షాట్ అందరినీ విస్మయపరిచింది. ఎందుకంటే, ఈ షాట్ పెద్ద ప్రమాదాన్ని తీసుకువచ్చేదే. కాకపొతే, అదృష్టం కొద్దీ కొద్దిలో తప్పిపోయింది. లేకపోతే ఆ షాట్ కొట్టిన జితేంద్ర అంపైర్ ను అవుట్ చేసిన వాడిగా చరిత్రలో నిలిచిపోయేవాడు. ఈ మ్యాచ్‌లో, టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో చాలా మార్పులు చేసింది, అందులో వరుసగా రెండు అర్ధ సెంచరీలు సాధించిన ఇషాన్ కిషన్ స్థానంలో జితేష్ శర్మ(Jithesh Sharma)కు అవకాశం లభించింది. ఈ సిరీస్‌లో ఈ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌కు మొదటిసారి అవకాశం లభించడంతో జితేష్ దానిని బాగా ఉపయోగించుకున్నాడు. లోయర్ ఆర్డర్‌లో బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు తానూ కీలకమే అని నిరూపించుకున్నాడు జితేష్.. Also Read: సిరీస్ మనదే.. ఒక మ్యాచ్ మిగిలుండగానే భారత్ ఘనవిజయం తప్పిన పెను ప్రమాదం.. టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయి దాదాపు కష్టాల్లో పడింది. అప్పుడు జితేష్ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి బౌలర్లపై దాడికి దిగాడు. 15వ ఓవర్లో క్రిస్ గ్రీన్ వేసిన రెండో బంతికి జితేష్ కళ్ళు చెదిరే సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే జితేష్ చేసిన పని అందరినీ భయపెట్టింది. వికెట్లపై దూసుకువస్తున్న ఫుల్ టాస్ బాల్ ను గ్రీన్ బయటకు వచ్చి బౌలర్ వైపుగా షాట్(Dangerous Shot)కొట్టాడు జితేష్. హై స్పీడ్ తో కొట్టిన ఈ షాట్ తో బాల్ బౌలర్ చేతుల్లోకి వెళ్ళినట్టే కనిపించింది.. కానీ బంతి వేగానికి గ్రీన్ దానిని పట్టుకోలేకపోయాడు. అతని చేతుల మధ్యలోంచి రాకెట్ స్పీడ్ లో దూసుకుపోయిన బంతి.. బౌలర్ వెనుకగా ఉన్న అంపైర్ KL అనంతపద్మనాభన్ మీదకు దూసుకు వచ్చింది. ఆ బంతి వేగం ఎంతగా ఉందంటే.. అంపైర్ కూడా పక్కకు తప్పుకునే ఛాన్స్ దొరకలేదు. దీంతో ఎలాగోలా తన చేతులతో బాల్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ బాల్ శాంతించి కింద పడింది. లిప్తపాటు వ్యవధిలో ఇదంతా జరిగిపోయింది. ఒకవేళ అంపైర్ గనుక బాల్ ను చేత్తో ఆపలేకపోతే అతని గుండెలపై అది తాకేది. ఇదంతా కెమెరాల్లో రికార్డ్ అయింది. రీప్లేలో చూసినపుడు అంపైర్ ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడో స్పష్టంగా కనిపించింది. అంపైర్ కు పెద్దగా గాయాలు కాకపోవడంతో మ్యాచ్ సజావుగా పూర్తి అయింది. ఆ వీడియో మీరు కూడా ఇక్కడ చూసేయండి. అది చూస్తే మీరే వామ్మో అని అంటారు.. pic.twitter.com/9sfTl7CoUz — Sanju Here 🤞| Alter EGO| (@me_sanjureddy) December 1, 2023 జితేష్ సూపర్ ఇన్నింగ్స్.. ఆ తర్వాతి బంతికి కూడా జితేష్(Dangerous Shot)సిక్సర్ బాదాడు. అతను కేవలం 19 బంతుల్లో 35 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రింకు సింగ్‌తో కలిసి త్వరగా 56 పరుగులు జోడించాడు. దాంతో జట్టు 9 వికెట్లు కోల్పోయి 174 పరుగుల విలువైన స్కోరును చేరుకోగలిగింది. రింకూ, యశస్వి కూడా టీమ్ ఇండియాకు ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. దీని తర్వాత, అక్షర్ పటేల్ - రవి బిష్ణోయ్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లపై ఉచ్చు బిగించి వారిని కేవలం 154 పరుగులకే పరిమితం చేసి 3-1 ఆధిక్యాన్ని సాధించి సిరీస్‌లో మూడవ విజయాన్ని నమోదు చేశారు. Watch this interesting Video: #australia #team-india #jithesh-sharma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి