Jharkhand: భార్య వేరే కాపురం కోసం ఒత్తిడి చేయొద్దు.. ఝూర్ఖండ్ హైకోర్టు కీలక తీర్పు భర్త కుటుంబంలో భార్య అంతర్భాగం అవ్వాలని.. ఆమె వేరే కాపురం కోసం ఒత్తిడి చేయకూడదంటూ ఝార్ఖండ్ హైకోర్టు తీర్పునిచ్చింది. వేరుగా ఉండాలంటే బలమైన కారణం ఉండాలి తప్పా.. పెళ్లి కాగానే భర్త కుటుంబంతోనే భార్య ఉండాలని గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులోని వివరాలను ప్రస్తావించింది. By B Aravind 26 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఝూర్ఖండ్‌లోని అక్కడి హైకోర్డు ఓ కీలక తీర్పునిచ్చింది. భర్త కుటుంబంలో భార్య అంతర్భాగం కావాలని.. ఆమె వేరే కాపురం కోసం ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదంటూ తేల్చి చెప్పింది. 25వ పేజీల తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ చాంద్.. రుగ్వేదం, యుజుర్వేదం, మనస్మృతిలోని అంశాలను కోర్టులో ప్రస్తావించారు. పాశ్చాత్య దేశాల్లో పెళ్లి జరిగాక కొడుకు తన కుటుంబ నుంచి వేరవుతాడు. కానీ ఇండియాలో ఇందుకు విరుద్ధంగా జరుగుతుందని అన్నారు. Also Read: ‘నారీశక్తి’ పేరుతో మహిళా శక్తిని చాటుతున్న గణతంత్ర వేడుకలు ఒకవేళ వేరుగా ఉండాలంటే బలమైన కారణం ఉండాలి తప్పా.. పెళ్లి కాగానే భర్త కుటుంబంతోనే భార్య ఉండాలని గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులోని వివరాలను న్యాయమూర్తి ప్రస్తావించారు. అయితే ఈ కేసుకు సంబందించి భార్యకు, మైనర్ కుమారునికి పోషణ చెల్లించాలంటూ కుటుంబ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవరించారు. చివరికి భార్యకు భరణం రద్దు చేసి.. కొడుకుకి చెల్లించాల్సిన మొత్తాన్ని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. Also Read: ఏబీవీపీ నుంచి పద్మవిభూషణ్ దాకా వెంకయ్య నాయుడి తిరుగులేని ప్రస్థానం #telugu-news #national-news #jharkhand-high-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి