Nani : గుండె బరువెక్కిందన్న నాని.. ఇంకా తనివితీరలేదంటూ అంజనా పోస్ట్.. వైరల్!

'జెర్సీ' సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాని, అతని భార్య అంజనా నెట్టింట ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. అర్జున్‌ తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయిందన్నారు. సుదర్శన్ థియేటర్ లో అభిమానులతో షో చూసి సందడి చేశారు.

New Update
Nani : గుండె బరువెక్కిందన్న నాని.. ఇంకా తనివితీరలేదంటూ అంజనా పోస్ట్.. వైరల్!

Jersey : నాని(Nani) నటించిన 'జెర్సీ' మూవీ నేటితో 5ఏళ్లు పూర్తి చేసుకుంది. గౌతమ్‌ తిన్ననూరి స్పోర్ట్స్‌ డ్రామా(Sports Drama) గా తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌(Sraddha Srinath) హీరోయిన్ గా నటించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ అయింది. అయితే ఐదేళ్లు పూర్తైన సందర్భంగా హైదరాబాద్‌(Hyderabad) లోని సుదర్శన్‌ థియేటర్‌లో ‘జెర్సీ’ స్పెషల్‌ షో వేశారు. ఈ షోకు నాని తన ఫ్యామిలీతో హాజరై అభిమానులతో సందడి చేశారు.

అర్జున్‌ తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది..
ఈ సందర్భంగా నాని ఫ్యాన్స్ చూపిస్తున్న ఆదరణకు ఖుషీ అవుతూ పోస్ట్ పెట్టాడు ‘ఈరోజు నాకెంతో ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఫ్యాన్స్ ఆదరణ చూస్తుంటే.. మళ్లీ తన ప్రయాణాన్ని ఆస్వాదించడం కోసం అర్జున్‌ తిరిగి భూమ్మీదకు వచ్చినట్టుంది. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయింది’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే నాని భార్య అంజనా(Anjana) సైతం.. ‘ఫస్ట్ టైమ్ థియేటర్‌లో సినిమా చూసిన రోజులు గుర్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సీన్స్‌ నన్ను భావోద్వేగానికి గురిచేస్తాయి. మా అబ్బాయి అర్జున్‌ ఇప్పుడిప్పుడే ‘జెర్సీ’ థీమ్‌ సాంగ్‌ పియానోపై ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టగా రెండూ వైరల్ అవుతున్నాయి. నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ కోసం వర్క్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయికగా కనిపించనున్నారు. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

#jersey #nani #anjana
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎం...

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment