Jawahar Lal Nehru:చాలా మందికి తెలియని నెహ్రూ ఆదివాసీ భార్య కథ ఇది.

ఏ సమాజ గౌరవానికీ నోచుకోని జవహర్ లాల్ నెహ్రూ ఆదివాసీ భార్య తాజాగా మరణించారు. అనుకోని సంఘటన ద్వారా నెహ్రూకు భార్య అయిన బుద్ధిని మంఝిన్...ఆయనతో పాటూ ఉండకపోయినా ఆయన భార్యగానే చలామణి అయింది. ప్రజలు మర్చిపోయిన ఈ కథ బుద్ధిని చనిపోవడంతో మళ్ళీ తెరపైకి వచ్చింది.

New Update
Jawahar Lal Nehru:చాలా మందికి తెలియని నెహ్రూ ఆదివాసీ భార్య కథ ఇది.

ఒక్క సంఘటన జీవితాలని మార్చేస్తుంది...తల్లక్రిందులు చేసేస్తుంది అనడానికి ఉదాహరణ సంతాలి తెగకు చెందిన బుద్ధిని మంఝిన్ జీవితం. ఏ తప్పూ చేయకుండానే అన్యాయంగా జీవితాంతం శిక్ష అనుభవించింది బుద్ధిని. పేరుకు మొట్టమొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భార్య. కానీ ఏం లాభం దాని వల్ల ఆమె సుఖపడింది లేదు సరి కదా బతికున్నన్నాళ్ళూ దుర్భర జీవితం అనుభవించింది. ఈమె గురించి చాలా తక్కువగా...అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆమె చనిపోవడంతో బుద్ధిని కథ మరోసారి తెరపైకి వచ్చింది.

Also read:ప్లీజ్ మమ్మల్ని క్షమించండి..ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్

జవహర్ లాల్ నెహ్రూ ఏంటి ఒక ఆదివాసీ మహిళను పెళ్ళి చేసుకోవడం ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. అసలు దీని వెనుక పెద్ద కథే ఉంది. 1959లో జరిగిన ఓ సంఘటన బుద్ధిని తలరాతనే మార్చేసింది. అసలేం జరిగిందంటే...డిసెంబర్ 6, 1959న దామోదర్ నది మీద నిర్మించిన పాంచెట్ డ్యామ్, జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడానికి అప్పటి ప్రధాని నెహ్రూ వచ్చారు. ఆ డ్యామ్ నిర్మాణంలో సంతాలీ తెగకు చెందిన ఆదివాసీ కూలీలు పని చేశారు. దీంతో దామోదర్ వ్యాలీ కార్పోరేషన్ ప్రధాని నెహ్రూ వచ్చినప్పుడు కూలీల్లో ఒకరైన బుద్ధిని మంఝిన్ ను ఆయనకు స్వాగతం చెప్పడానికి పిలిచారు. ఆమె వచ్చింది ప్రధానికి స్వాగంత పలికింది. మెడలో పూలదండ వేసింది. నెహ్రూ అలవాటుగా ఆమెకు షేక్ హ్యండ్ కూడా ఇచ్చారు. అక్కడితో ఆగిపోకుండా ప్రాజెక్టు వల్ల ఆదివాసీ భూములు చాలా పోయాయి కదా, నిర్మాణానికి కూడా వాళ్ళే పని చేశారు. అందుకే వాళ్ళకు గౌరవం దక్కాలి అనే భావంతో బుద్ధినీ చేతనే డ్యామ్ ను ఓపెన్ కూడా చేయించారు. తరువాత ఆమెను దగ్గరగా కూడా తీసుకున్నారు. ఒక కూలీ ఓ ప్రాజెక్టును ప్రారంభించడం అదే మొదటిసారి. దీంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. అన్ని పేపర్లు ఈ వార్తను ప్రముఖంగా రాసాయి. ఇదే బుద్ధిని జీవితాన్ని తల్లకిందులు చేసేసింది.

nehru

ప్రాజెక్టు ప్రారంభం అయిపోయింది. బుద్ధిని కూడా చాలా హ్యాపీ అయిపోయింది. అదే ఆనందంలో ఆమె తిరిగి తన స్వస్థలానికి వెళ్ళింది. పాంచెట్ అనేది ఆమె ఊరు. ప్రస్తుతం అది జార్ఖండ్ లో ఉంది. అయితే ఊరిలోకి అడుగు పెట్టగానే బుద్ధిని ఆనందం ఆవిరి అయిపోయింది. ఊళ్ళో పెద్దలు ఆమె వచ్చిన వెంటనే పంచాయితీ పెట్టారు. నువ్వు ప్రధాన మెడలో దండ వేశావు, ఆయనా నీ మెడలో దండ వేశారు. ఇద్దరూ చేతులు కలిపారు. కాబట్టి మీ ఇద్దరికీ పెళ్ళి అయిపోయింది అన్నారు. అక్కడితో ఆగిపోతే బావుండును...అలా కాక సంతాలీ తెగకు చెందిన వ్యక్తిని కాక మరొకరిని పెళ్ళి చేసుకున్నావు కాబట్టి నిన్ను తెగ నుంచి వెలి వేస్తున్నాము అంటూ తీర్పు చెప్పారు. దీంతో ఆమె ఒక్కసారిగా ఒంటరిదైపోయింది. కట్టుబాట్లుకు లోబడి ఆమెను పెళ్ళి చేసుకోవడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.

nehru

ఇది మొదలు ఆమె చనిపోయేంతవరకూ కష్టపడుతూనే ఉంది. సొంత తెగ ఆదరించలేదు సరి కదా...తిరిగి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ లో ఉద్యోగం కూడా రాకుండా చేసింది. దీంతో ఆమె బతకడం కూడా కష్టమైంది. అక్కడ ఉండలేక బెంగాల్ లోని పురూలియాకు వెళ్ళిపోయింది. అక్కడ సుధీర్ దత్తా అనే యువకుడు పరిచయం అయ్యాడు. పెళ్ళి చేసుకుందాము అనుకున్నారు కానీ మళ్ళీ అవే కులం కట్టుబాట్లు అడ్డమొచ్చాయి. దీంతో వాళ్ళిద్దరూ కొన్నాళ్ళు సహజీవనం చేశారు. దీనివల్ల ఆమెకు రత్న అనే కూతురు కూడా పుట్టింది. ఇన్ని జరిగినా..ఏళ్ళు గడిచినా సంతాలీ తెగ మాత్రం ఆమెను క్షమించలేదు, వెలిని వెనక్కి తీసుకోలేదు. మళ్ళీ పాంచెట్ తిరిగి వచ్చేసింది...నానా కష్టాలు పడింది. ఈ విషయం నెహ్రూ కుమారుడు రాజీవ్ గాంధీ దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే స్పందించి బుద్ధినిని తన దగ్గరకు రప్పించుకున్నారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ లో ఉద్యోగం వచ్చేలా ఏర్పాటు చేశారు. దాంతో ఆమె బతుకు కొంత బాగుపడింది. కానీ ఆమె కష్టాలు మాత్రం పూర్తిగా తీరలేదు. కూతురు విషయంలో కూడా అవే కట్టుబాట్లు అడ్డుపడ్డాయి. కానీ ఎలాగోలా కష్టపడి రత్నకు పెళ్ళి చేసింది. తరువాత కూతురు, అల్లుడి దగ్గరే చనిపోయేంత వరకూ బతికింది.

nehru

చివరకు లాస్ట్ శుక్రవారం బుద్ధిని మంఝిన్ గుండెపోటుతో చనిపోయింది. అంతకు ముందు కొంతకాలం ఆమె అనారోగ్యంతో బాధపడింది. అయితే ఇప్పుడుకూడా సంతాలీ తెగ ప్రజలు ఆమెను ఓన్ చేసుకోవడం లేదు. తమ బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. చివరి వరకూ ఎవరికీ దక్కని...ఏ సమాజం అక్కున చేర్చుకోని అనామకురాలిగానే బతికింది బుద్ధిని.

#story #budhhini #santali #wife #jawahar-lal-nehru
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!...

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment