Jani Master : 2029లో సీఎం, 2034లో పీఎం.. రాసి పెట్టుకోండి.. పవన్ కళ్యాణ్ పై జానీ మాస్టర్ కామెంట్స్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.' పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, 2029లో సీఎం, 2034లో ప్రధాన మంత్రి అవుతారు. ఇది రాసి పెట్టుకోండి' అని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

New Update
Jani Master : 2029లో సీఎం, 2034లో పీఎం.. రాసి పెట్టుకోండి.. పవన్ కళ్యాణ్ పై జానీ మాస్టర్ కామెంట్స్

Jani Master : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా నెల్లూరులో జరిగిన జనసేన వేడుకల్లో పాల్గొన్న ఆయన.. పవన్ కళ్యాణ్ సీఎం మాత్రమే పీఎం కూడా అవుతారని అన్నారు.

అందుకు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జానీ మాస్టర్ మాట్లాడుతూ.." పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, 2029లో సీఎం, 2034లో ప్రధాన మంత్రి అవుతారు. ఇది రాసి పెట్టుకోండి, జై జనసేన అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.


Also Read : రికార్డు ధర పలికిన ‘పుష్ప 2’ ఓటీటీ రైట్స్.. వామ్మో.. అన్ని వందల కోట్లా?

ఇక ఈ వీడియోని పవన్ ఫ్యాన్స్ తో పాటూ జనసేన ఫాలోవర్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. కాగా జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఎన్నికల్లో జనసేన తరుపున ప్రచారం కూడా చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు