AP Elections 2024: మండలి వర్సెస్‌ జనసేన.. అవనిగడ్డలో రాజుకున్న నిప్పు!

మండలి బుద్ధ ప్రసాద్ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. సొంత గ్రామంలో జనసైనికులపై బుద్ధప్రసాద్ తమ్ముడు కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుద్ధ ప్రసాద్‌కు జనసేన పార్టీ టికెట్ ఇస్తే 100 కుటుంబాలు పవన్‌ పార్టీ నుంచి బయటికి వస్తాయని జనసైనికులు హెచ్చరించారు.

New Update
AP Elections 2024: మండలి వర్సెస్‌ జనసేన.. అవనిగడ్డలో రాజుకున్న నిప్పు!

AP Elections 2024: టీడీపీ నేతలు తీరుపై జనసేన నేతలు మండిపడ్డారు. అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన పార్టీకి ఇస్తే.. 21 సీట్‌లో మొదటి సీటు ఓడిపోయేది అవనిగడ్డ అని టీడీపీ నేతలు అన్నారు. నేడు ఏ విధంగా జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ కండువా కప్పుకుంటున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.  నేడు అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ అత్యవసర సమావేశాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకట్నాథ్ అధ్యక్షతన ఆ పార్టీ నేతలు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అందరు కూడా బుద్ధ ప్రసాద్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

జనసేన పార్టీ నుంచి బయటికి వస్తాయి:

అవనిగడ్డలో గాజు గ్లాసుకి ఇస్తే ఓడిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన టీడీపీ నేతలు నేడే ఏ విధంగా బుద్ధ ప్రసాద్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించారు. బుద్ధ ప్రసాద్ టిక్కెట్ ఇస్తే మూకముడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కొంతమంది బావ దేవరపల్లి జనసైనికులు మాట్లాడుతూ.. బావదేవరపల్లిలో జరిగిన అంకాలమ్మతల్లి జాతరలో జనసేన జెండాలు పట్టుకున్న వారిపై బుద్ధప్రసాద్ తమ్ముడు కేసులు పెట్టించాడని తీవ్రంగా మండిపడ్డారు. బుద్ధ ప్రసార్‌కు జనసేన పార్టీ టికెట్ ఇస్తే ఆ గ్రామం నుంచి 100 కుటుంబాలు జనసేన పార్టీ నుంచి బయటికి వస్తాయని హెచ్చరించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు అంతా కూడా బుద్ధ ప్రసాద్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల పోటీ చేయాలంటే డబ్బులు కావాలి అన్న వ్యక్తి నేడు జనసేన టికెట్ ఇస్తే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెబితే మేం కూడా అదే విధంగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. టీడీపీ నేతలు సోషల్ మీడియాలో తమ ఇష్టానుసారం ప్రచారం చేసి.. నేడు ఏ విధంగా జనసేన పార్టీలో చేరుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర సర్పంచ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు, మత్తి వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకట్‌నాథ్, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి లంకె యుగంధర్‌రావు, ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కొండవీటి సునీత, బొప్పన భానుతోపాటు జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: వ్యాక్స్‌ చేయించుకున్నాక అమ్మాయిలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: ముమ్మాటికి భద్రతా లోపమే.. అమిత్ షా, మోదీ రాజీనామా చేయాలి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

ఉగ్రదాడి ముమ్మాటికి భద్రత లోపమేనని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఫైర్ అయ్యారు. ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
 ys sharmila

ys sharmila

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మనం దేశం మీద జరిగిన దాడి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల అన్నారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని  ప్రధాని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారని.. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారని అన్నారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కశ్మీర్ కి వెళ్తుంటారన్నారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి భద్రత లోపమేనని ధ్వజమెత్తారు. టూరిస్టులపై కాల్పులు జరుపుతుంటే ఆర్మీ వాళ్లు లేనే లేరన్నారు. ప్రొటెక్షన్ కోసం ఉండే సెక్యూరిటీ కూడా లేదన్నారు. ఇంతమంది చనిపోయారు అంటే ప్రభుత్వ లోపమేనన్నారు. ఉగ్రవాదం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందన్నారు. ఈ ఘటనకు అమిత్ షా, మోదీ బాధ్యత వహించి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అని అన్నారు. నేడు దేశ నిఘా వ్యవస్థ దేశం కోసం పనిచేయడం లేదన్నారు. ఇండియా ఇంటలిజెన్స్ అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల మీద పనిచేస్తోందని ఆరోపించారు. 

మోదీకి అధికారంలో ఉండే హక్కు లేదు..

ఇంత ఘోరంగా సెక్యూరిటీ విఫలం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లకు అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. వీళ్ళు దేశానికి చౌకిదార్ కాదు..బీజేపీకి చౌకిదార్లని అన్నారు. ఈ దేశ దర్యాప్తు వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. నిఘా వ్యవస్థ బలం అంతా ప్రధాని మోదీ కోసం పని చేస్తోందన్నారు. దేశ భద్రతను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి కేంద్రం తప్పిదమేనని ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో ఒక ముస్లిం కూడా చనిపోయారని.. దేశంలో ఉన్న ముస్లింలను చెడ్డవాళ్ళు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మతం పేరుతో యుద్ధం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ దేశంలోనే ఇంటర్నల్‌గా భద్రత లేదన్నారు. అన్ని మతాలు సమానం అనే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మోదీ శ్రమ దేశ భద్రత కోసం పెట్టి ఉంటే బయట వాళ్ళు చొరబడే పరిస్థితి లేదన్నారు.

Advertisment
Advertisment
Advertisment