Andhra Pradesh:ఎన్నికల వేళ జనసేనకు షాక్‌..ఆమంచి రాజీనామా

జనసేనలో అసంతృప్తి పర్వం కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తుంటే ఆపార్టీకి నేతలు షాక్ ఇస్తున్నారు. తాజాగా చీరాల నియోజకవర్గం సమన్వయకర్త ఆమంచి శ్రీనివాసులు జనసేనకు రాజీనామా చేశారు

New Update
Andhra Pradesh:ఎన్నికల వేళ జనసేనకు షాక్‌..ఆమంచి రాజీనామా

Amanchi Resigned To Janasena: జనసేనకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకం జరిగిన తర్వాత ఈపార్టీలో నేతలు కోపంగా ఉన్నారు. జనసేనకు 24 సీట్లే రావడం వారిలో అసంతీప్తికి దారి తీసింది. దీంతో చాలా మంది తాము అనుకున్న స్థానాల్లో టికెట్లను పొందలేకపోతుననారు. ఇది వారికి నచ్చడం లేదు. దీన్ని బహిరంగంగానే ప్రకటించారు కూడా. అయినా కూడా జనసేనాని పవన్ కల్యాణ్‌ సీట్ల సర్దుబాటు మీద ఏమీ స్పందించకపోవడంతో ఇప్పుడు జనసైనికులు పక్క పార్టీల బాట పడుతున్నారు.

ఆమంచి రాజీనామా..

తాజాగా చీరాల నియోజకవర్గం సమన్వయకర్త ఆమంచి శ్రీనివాసులు పార్టీకి రాజీనామా చేశారు.వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆమంచి తెలిపారు. కానీ దీని వెనుక కారణం మాత్రం అసంతృప్తే అని అంటున్నారు. ఆమంచి శ్రీనివాసులు పార్టీ కార్యాలయంలో రిజైన్‌ లెటర్‌ ఇచ్చారు. అయితే రాజీనామా చేసినా జనసేన రాష్ట్ర కార్యదర్శిగా మాత్రం కొనసాగుతానని ప్రకటన చేశారు. అయితే ఆమంచి రాజీనామాకు కారణం అసంతృప్తి కాదని..దాని వెనుక రాజకీయ వ్యూహం ఉందని చెబుతున్నారు. టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు ఆమంచి శ్రీనివాసులు. కానీ టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా జనసేనకు గిద్దలూరు సీటు మాత్రమే వచ్చింది. దీంతో గిద్దలూరు టికెట్‌ కోసం ఆమంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే చీరాల బాధ్యతల నుంచి ఆమంచి తప్పుకున్నారని చెబుతున్నారు. ఆయన రాజీనామా వెనుక వ్యూహం ఇదేనని ఇన్‌సైడ్ వర్గాల భోగట్టా.

కాపు నేతల చుట్టూ రాజకీయాలు..

మరోవైపు ఏపీ(AP) లో కాపులు, కాపు నేతల చుట్టూ రాజకీయాలు గిర్రున తిరుగుతున్నాయి. కాపు నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) ఏ క్షణంలోనైనా వైసీపీ(YCP) కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తగ్గట్టే కాసేపట్లో ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు వెళ్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ముద్రగడతో కాకినాడ పరిధిలోని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు భేటీ అవనున్నారు. ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, ద్వారంపూడి, ఇతర నేతలు ముద్రగడతో భేటీ కానుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముద్రగడను ఈ నేతలంతా కలిసి వైసీపీలోకి ఆహ్వానించనున్నారు.

Also Read:Andhra Pradesh : కాకినాడ ఉప్పాడ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. మత్స్యకారుల ఆందోళన

Advertisment
Advertisment
తాజా కథనాలు