Pawan : ఇప్పుడు కుల గణన ఎందుకు?.. సీఎం జగన్‌కు పవన్ బహిరంగ లేఖ కుల గణనపై సీఎం జగన్ కు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు ఎందుకు కుల గణన చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పది ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. By V.J Reddy 26 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Janasena Chief Pawan Kalyan : సీఎం జగన్(CM Jagan) కు బహిరంగ లేఖ రాశారు జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan). మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్రంలో ఇప్పుడు కుల గణన ఎందుకు?.. దీనికి సీఎం జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖను విడుదల చేశారు. రిక్రూట్ మెంట్ పది ప్రశ్నలతో జనసేన బహిరంగ లేఖ.. 1. ఈ కులగణన ఉద్దేశం మీకు ఎన్నికల ముందే ఎందుకు వచ్చింది? 2. ఈ ప్రక్రియ కారణాలు వివరిస్తూ మీరు ఎందుకు ఏ విధమైన ప్రభుత్వ పరమైన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదు? 3. ఇది రాజ్యాంగం మా అందరికి ఆర్టికల్ 21 ప్రకారం చెప్పిన వ్యక్తిగత గోప్యత, భద్రతా, స్వేచ్ఛ హరించడం కాదా? 4. కులగణన మీ ఉద్దేశం ఐతే, మరి మీకు ఉపకులం, ఆదాయం, భూమి యాజమాన్యం వివరాలు, కోళ్లు, మేకలు, ఆవులు, గేదలు ఇవ్వన్నీ ఎందుకు? 5. బీహార్ ప్రభుత్వం చేసిన కులగణన సుప్రీం కోర్టులో ఉన్న నేపథ్యంలో, గౌరవ సుప్రీం కోర్ట్(Supreme Court) తన తీర్పుని ప్రకటించక ముందే మీరు మీ స్వీయ ప్రయోజనాలకు ఎందుకు ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు? 6. జనగణన ఒక సంక్షిప్తమైన ప్రక్రియ, ఇది ఎంతో మంది నిపుణలతో చెయ్యవలసిన ప్రక్రియ, మీ వాలంటీర్లకు ఆ అర్హత, సామర్థ్యాలు ఎలా వున్నాయ్ అని నిర్ధారించారు? 7. ఇటువంటి డేటా సేకరణ ప్రక్రియ గతంలో కేంబ్రిడ్జ్ అనలిటిక చేసినప్పుడు అది ఏ విధంగా సమాజంలో అశాంతిని, అల్లర్లకు ప్రేరేపించాయి అనే విషయం మీకు తెలియదా? వాటిని ఎన్నికల కోసం స్వీయ ప్రయోజనాలకు మీరు ఎలా వాడుకున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా? 8. ఇవన్నీ మీ అధికార దాహానికి ప్రతీక కాదా? ఒక వేళ కాకపొతే, ఇలా సేకరించిన డేటా ఏ విధమైన దుర్వినియోగం జరగకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? 9. ప్రజల నుండి డేటా సమ్మతి అనేది మీరు ఎలా తీసుకుంటున్నారు? అందరూ మీ నియంతృత్వానికి తలవంచుతారు అనుకుంటున్నారా? 10 ప్రభుత్వ వనరులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వీయ ప్రయోజనాలకు వాడుకోవడం, దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూట్లు పోడవటం కాదా? 11. వాలంటీర్లు ద్వారా వైసీపీ ప్రభుత్వం సేకరిస్తున్న కుల గణన, ఇతర వివరాలను ఏ కంపెనీ భద్రపరుస్తారు అనే అంశంపై శ్వేత పత్రం విడుదల చెయ్యాలి. 12. జగన్ రెడ్డి గారి YSRC Party ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలపై రాజకీయంగానే న్యాయ పరమైన మార్గాలను కూడా విశ్లేషించే దిశగా ఆలోచిస్తాము. Also Read : Sajjanar: త్వరలో డ్రైవర్లు, కండక్టర్ల భర్తీ.. సజ్జనార్ కీలక ప్రకటన To Hon.Chief Minister of AP, Shri Y.S. Jagan Reddy garu…@AndhraPradeshCM Respected Sir, This letter is regarding the sensitive personal data that is being collected in the name of ‘AP Caste Based Census’, through your ‘extra Constitutional body called Volunteer System’,as… pic.twitter.com/YIdplfRysh — Pawan Kalyan (@PawanKalyan) January 26, 2024 DO WATCH: #pawan-kalyan #cm-jagan #ap-election #caste-census #ap-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి