Pawan Kalyan: కూటమి విజయం తర్వాత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. జగన్, వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువులు కాదన్నారు. ఇది కక్షసాధింపు సమయం కాదని.. ఏపీకి పునాదులు వేసే సమయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు. By B Aravind 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి AP Elections 2024 : ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘనవిజయం అనంతరం జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.'వైసీపీ (YCP) పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం, కక్ష సాధింపుల కోసం వచ్చిన విజయం కాదు. జగన్, వైసీపీ నాకు వ్యక్తిగతంగా శత్రువులు కాదు. ఇది కక్ష సాధింపు సమయం కాదు. ఏపీకి పునాదులు వేసే సమయం. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. 5 కోట్ల మంది కోసం పనిచేస్తాం. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ సీట్లలో గెలిచి 100 శాతం గెలిచిన పార్టీ జనసేన. ఏపీకి చీకటి రోజులు ముగిశాయి. Also read: ఎన్డీయేను దెబ్బతీసే యోచనలో ఇండియా కూటమి.. చంద్రబాబు, నితీష్‌కు గాలాలు ఇకనుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు బలంగా ఉంటాయి. ప్రతిఒక్కరు బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుంది. త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC Notification) విడుదల చేసే బాధ్యత తీసుకుంటాం. పీఠాపురం ప్రజలు పవన్ కల్యాణ్‌ను గెలిపించలేదు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల్ని గెలిపించారు. మీరు ఆకాశమంతా విజయం ఇచ్చారు. పెద్ద బాధ్యతను అప్పగించారు. ఇకనుంచి మీ ఇంట్లో ఒకడిగా ఉంటూ నిర్మాణాత్మకంగా పనిచేస్తానని' అన్నారు. Also Read: ఈ గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది: మెగా బ్రదర్ నాగబాబు! #pawan-kalyan #telugu-news #janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి