Iran : ఇరాన్‌కు మంత్రి జైశంకర్ కాల్..17మంది భారతీయ సిబ్బందితో మాట్లాడ్డానికి అనుమతి.. భారతదేశానికి వస్తున్న నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిపిందే. ఇందులో 17 మంది భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. వీరి విషయంలో ఇప్పుడు కాస్త ఊరట లభించింది. 17మందితో మాట్లాడేందుకు ఇరాన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. By Manogna alamuru 15 Apr 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Jai Shankar : ఇజ్రాయెల్ – ఇరాన్(Israel-Iran) ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. తాజాగా హార్మూజ్ జలసంధిలో పోర్చగీసు జెండాలతో, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న ఓ వాణిజ్య నౌకను ఇరాన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నౌకలో 25 మంది ఉండగా.. అందులో 17 మంది భారతీయులే(Indians) కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే వారిని విడుదల చేసేందుకు.. భారత్ ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై ఇజ్రాయెల్ కూడా స్పందించింది. వివాదాన్ని తీవ్రతరం చేయడం వల్ల ఇరాన్ తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. హెలికాప్టర్ సాయంతో నౌకను వెంబడించి.. ప్రత్యేక బలగాలు ఆ వాణిజ్య నౌకను నియంత్రణలోకి తీసుకన్నట్లు టెహ్రాన్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఆ నౌకను ఇరాన్ ప్రాదెశిక జలాల వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నౌక ఇజ్రెయ్ కుబేరుడైన ఇయాల్ ఓఫర్ జోడియస్‌గా సంస్థకు చెందిన ఎంఎస్‌సీ ఏరిస్(MSC Aries) గా భావిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడొచ్చు... అయితే ఇప్పుడు ఈ విషయంలో కొంత ఊరట లబించింది. మన దేశ అధికారులు ఓడలో ఉన్న బారతీయులను కలిసేందుకు అనుమతినిచ్చింది ఇరాన్. ఈ విషయాన్ని ఆదేశ విదేశాంగ మంత్రిత్వే శాఖే స్వయంగా వెల్లడించింది. అంతుకు ముందు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడారు. భారతీయ సిబ్బందిని విడుదల చేయాలని కోరారు. దాంతో పాటూ ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతను నివారించాలని.. సంయమనం పాటించాలని..కూర్చుని చర్చించుకోవాలని నూచించారు జైశంకర్(Jai Shankar). Also Read : Salman Khan: నెల రోజుల నుంచీ అమెరికాలో కుట్ర..సల్మాన్ ఇంటి బయట కాల్పులకు ప్లాన్ ఇలా.. #indians #jai-shankar #israel-iran #msc-aries మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి