Jaggaredy: మోదీకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్.. వచ్చే ఎన్నికల్లో విలీనం ఖాయం: జగ్గారెడ్డి!

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం హామీతోనే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. విలీనం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్నారు. మోదీకి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే అని, కవిత లిక్కర్ మాఫియా క్వీన్ అంటూ విమర్శలు గుప్పించారు.

New Update
Jagga Reddy: ఐదేళ్లు రేవంతే సీఎం.. జగ్గారెడ్డి కీలక ప్రకటన

TG News: కవితకు బెయిల్ రావడం వెనక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం హామీ ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయనున్నాయని, ఇదే మోదీకి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని జగ్గారెడ్డి చెప్పారు. లిక్కర్ మాఫియా కింగ్ కవితకు ఐదు నెలలకే బెయిల్ ఇచ్చారని, సిసోడియాకు మాత్రం 17 నెలల వరకు బెయిల్ రాలేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఐదు నెలలకే కవితకి బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ నీ దెబ్బతీసే కుట్రలో బీజేపీ, బీఆర్ఎస్ ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. జడ్జి బెయిల్ ఆర్డర్ ఇవ్వకముందే మూడు రోజులుగా కేటీఆర్ సోషల్ మీడియా హడావుడి చేస్తున్నారన్నారు. ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల లోపు విలీనం కావచ్చు లేదంటే పొత్తు పెట్టుకోవచ్చు అన్నారు.

బీఆర్ఎస్ పై కోర్టు చర్యలు తీసుకోవాలి..
అలాగే బెయిల్ వస్తుందని ముందే చెప్పిన కేటీఆర్ పై కోర్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెయిల్ పై విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి చెప్పే వరకు తెలియదు. కానీ కవిత బెయిల్ పై మూడు నాలుగు రోజుల నుంచి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ ఎలా సోషల్ మీడియాలో ప్రచారం చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ కు ఒప్పందాల్లో భాగంగానే బెయిల్ వచ్చింది. జడ్జి చెప్పకముందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు ముందు సమాచారం వచ్చింది. దేశంలో విచిత్ర పరిపాలన జరుగుతుంది. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అందుకే బీజేపీ.. బీఆర్ఎస్ తో కలిసి పోయే దాంట్లో భాగమే లిక్కర్ కేసు. బీజేపీ వ్యూహం ఏమిటంటే.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ ను కలుపుకునే పనిలో ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించింది. కవిత బెయిల్ కండిషన్ లో భాగమే పార్లమెంట్ ఎన్నికల్లో బీజపీ కి ఓట్లు వేయించారన్నారు జగ్గారెడ్డి.

ఇది కూడా చదవండి: Kolkata: అభయ అత్యాచార కేసులో పోలీసుల హస్తం? వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

సొంత నియోజక వర్గం కేసీఆర్ వదులుకున్నారు..
ఇక మెదక్ లో బీఆర్ఎస్ గెలుస్తుంది అనే పరిస్థితిలో మూడో స్థానంకు ఎందుకు పోయిందన్నారు. కవిత కోసం సొంత పార్లమెంట్ నియోజక వర్గం కేసీఆర్ వదిలేసుకున్నారు. మాకు నాలుగు సీట్లు తగ్గడానికి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోవడమే కారణం. రాజకీయంగా కాంగ్రెస్ నీ బలహీన పరిచే ఒప్పందంలో భాగమే బీజేపీ, బీఆర్ఎస్ ఎత్తుగడ. సిసోడియా, కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడానికి ఆలోచించిన కోర్టులు.. కవితకు ఐదు నెలల్లో బెయిల్ ఎలా ఇచ్చాయని ప్రశ్నించారు. బీజేపీ ఉత్తరాన వీక్ అయ్యింది. దక్షిణాదిలో బీఆర్ఎస్ ను బలహీన పరిచారు. ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకొని సీట్లు గెలిచింది. మేము జడ్జిని తప్పు పట్టడం లేదు. జడ్జి చెప్పక ముందే బీఆర్ఎస్ ఎలా చెప్పుకుంది అనేది మా వాదన. న్యాయవ్యవస్థ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

YS jagan: జగన్ పర్యటనలో భద్రతా లోపం.. హెలికాప్టర్‌ అద్దాలు ధ్వంసం

వైసీపీ అధినేత జగన్ అనంతపురం పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. రాప్తాడుకి హెలికాఫ్టర్‌లో వచ్చిన ఆయన్ని చూడ్డానికి జనం భారీగా తరలివచ్చారు. కార్యకర్తలు పోలీసులను దాటుకొని హెలికాఫ్టర్ దగ్గరకు దూసుకొచ్చారు. జనం తాకిడికి హెలికాఫ్టర్ అద్దాలు పగిలిపోయాయి.

New Update
YS jagan helicoptor

YS jagan helicoptor Photograph: (YS jagan helicoptor)

వైసీపీ నేత జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించారు. హెలికాఫ్టర్‌లో అక్కడికి చేరుకున్న జగన్‌ను చూడడానికి వందలాది వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. జగన్‌ను కలిసేందుకు కార్యకర్తలు హెలికాఫ్టర్ వద్దకు దూసుకొచ్చారు. జనాలను పోలీసు సిబ్బంది నియంత్రించలేక పోయ్యారు. జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ (అద్దాలు) ధ్వంసమైయ్యాయి. భద్రతా కారణాల రీత్యా వీఐపీని అలాంటి పరిస్థితిలో హెలికాఫ్టర్‌లో తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.

హెలికాప్టర్‌ దగ్గర క్రౌడ్‌ను కంట్రోల్ చేయడానికి సరిపడా సెక్యూరిటీ పెట్టలేదని పోలీసు వ్యవస్థపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ హత్యకు కుట్ర చేశారని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం పైలెట్ల సూచనతో రోడ్డు మార్గంలో జగన్‌ బెంగళూరుకు బయలుదేరారు.

Advertisment
Advertisment
Advertisment