AP Government: ఏపీలోని పేదలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఈ నెల 18 నుంచి ఆ కార్డుల పంపిణీ! ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై ప్రకటన రిలీజ్ చేశారు. డిసెంబర్ 20 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. By Bhoomi 05 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కాయక్రమంలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వాళ్లందరికీ సకాలంలో మందులు అందించడంతోపాటు మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యారోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడా కూడా రాజీపడొద్దని అధికారులకు సీఎం సూచించారు. ఆరోగ్యశ్రీ వినియోగంపై అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు జగన్ సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 20 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతిఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ తోపాటు దిశ యాప్స్ కూడా ఉండేలా అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నరోగులకు సకాలంలో మందులు అందించాలన్నారు. అసుపత్రుల్లో ఎక్కడా కూడా సిబ్బంది కొరత ఉండకూదన్ని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన రోగులకు చేయూతనిచ్చే కార్యక్రమంపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం తెలిపారు. దిగువస్థాయి వైద్య సిబ్బంది నుంచి సకాలంలో ఇండెంట్ వస్తే వెంటనే సమయానికి మందులు ఇవ్వాలని సూచించారు. ఫ్యామిలి డాక్టర్ ప్రతి గ్రామానికి వెళ్తూ మందులు అందాయా లేదా తెలుసుకోవాలని తెలిపారు. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్ న్యూస్..ఖాతాల్లోకి రూ. 6వేలు..సర్కార్ అందిస్తున్న ఈ సాయం గురించి మీకు తెలుసా..? #jagan #ap #aarogyasri-cards #new-aarogyasri-cards మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి