Mid Day Meal: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. 5స్టార్ రేంజ్ లో మెనూ! ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ యేడాదినుంచి మరింత రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిచబోతున్నట్లు తెలిపింది. విజయవాడలోని తాజ్ హోటల్ చెఫ్ లతో స్కూల్ వంట సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుంది. By srinivas 27 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Mid Day Meal Scheme in AP: ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తిపి కబురు చెప్పింది. ఈ యేడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం మరింత నాణ్యతతో రుచికరంగా అందించబోతున్నట్లు తెలిపింది. ఇందుకోసం విజయవాడలోని తాజ్ హోటల్ లో పనిచేసే చెఫ్ లతో స్కూల్ లో వంటచేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నట్లు సమాచారం. పప్పు, పప్పుచారు, వెజ్ కర్రీస్, పులిహోర, పొంగల్ వంటి వంటివి మెనూలో తప్పకుండా ఉండాలని సూచించింది. అలాగే తిరుపతి తాజ్ హోటల్ చెఫ్ లతో మధ్యాహ్న భోజనం రుచికరంగా చేసేందుకు అవసరమయ్యే టిప్స్ తో వీడియోలను కూడా రూపొందించారు అధికారులు. రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలు ఎలా చేయాలో వివరించటంతో పాటు వాటి వల్ల కలిగే లాభాల గురించి కూడా చెఫ్‌లు వివరిస్తారు. పాఠశాల విద్యాశాఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఇందుకు సబంధించిన సమాచారం, వీడియోలను అప్లోడ్ చేశారు. Also Read: అధిక బరువుకు బీరకాయతో చెక్ పెట్టేయండి..! #ap #cm-ys-jagan #midday-meal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి