Kavitha: కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు.. బెయిల్ సంగతేంటి ! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయి నేటితో వంద రోజులయ్యాయి. ఆమె బెయిల్ కోసం ప్రయత్నించినా అది ఫలించడం లేదు. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇన్నిరోజులైనా కవితను చూడటానికి వెళ్లకపోవడం గమనార్హం. By B Aravind 24 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. గత కొన్ని నెలలుగా దేశంలో సంచలనం రేపుతున్న కుంభకోణం. ఈ కేసులో ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇటీవల కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. మళ్లీ ఈడీ (ED) హైకోర్టుకు వెళ్లడంతో ఆయన బెయిల్ నిలిచిపోయింది. ఇదిలాఉండగా.. మరోవైపు కవిత సంగతేంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె పిటిషన్ వేయగా.. ఇందుకు కోర్టు అంగీకరించలేదు. అలాగే ఆమె కస్టడీ కూడా పొడిగిస్తూనే ఉంది న్యాయస్థానం. అయితే ఈ లిక్కర్ స్కామ్‌కు (Delhi Liquor Scam Case) సంబంధించి మనీలాండరింగ్ కేసులో కవిత అరెస్టయ్యి నేటికి వంద రోజులయ్యాయి. Also Read: సీఎం రేవంత్ నిరుద్యోగులను మోసం చేశారు.. TGPSC కార్యాలయం ముట్టడించిన నిరుద్యోగ సంఘాలు! బెయిల్ ప్రయత్నాలు విఫలం ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు.. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో హాజరుపడటంతో ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్‌ను విధించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ అవి విఫలమవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లోనే (Tihar Jail) ఉంటున్నారు. ఇప్పటికే ఆమెపై ఈడీ కేసులు ఉండగా.. ఇటీవలే సీబీఐ (CBI) కూడా ఈ స్కామ్‌లో అవినీతి ఆరోపణలతో కేసు పెట్టింది. ఆమె బెయిల్ కేసం అప్లై చేసిన ప్రతిసారీ కోర్టులో సీబీఐ, ఈడీలు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమెకు బెయిల్ రావడం కష్టంగా మారింది. కూతురుని చూడని కేసీఆర్ అయితే కవిత అరెస్టయి నేటితో 100 రోజులు పూర్తయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR).. కూతుర్ని ఒక్కసారి కూడా కలవడానికి వెళ్లలేదు. కేటీఆర్, హరీష్‌రావు, కవిత భర్త అనిల్ తదితర కుటుంబ సభ్యులందరూ ఆమెను కలిసినప్పటికీ.. కేసీఆర్ మాత్రం అక్కడికి వెళ్లలేదు. అయితే కేసీఆర్ ఎందుకు వెళ్లలేకపోయారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి కేసీఆర్‌కు ఆడబిడ్డగా కవితపై చాలా ప్రేమను చూపిస్తారు. ఓ ఇంటర్వూలో కూడా ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కూతురిని అలా జైలులో చూడటం ఇష్టంలేక.. అక్కడికి వెళ్లి ఆ బాధను తట్టుకోలేకే ఆయన ఇప్పటి వరకు కవితను చూడటానికి వెళ్లలేదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. Also Read: వీళ్ళసలు మనుషులేనా? చిన్నారిని చిదిమేసిన కన్నతండ్రి.. మేనమామ..అన్న! కవిత నేరం చేసినట్లు ఆధారాలున్నాయి తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కవిత అరెస్టు కూడా ఓటర్లపై కొంత ప్రభావం చూపించింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్.. చివరికి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక కవిత జైలు నుంచి బయటకు వస్తుందనే ప్రచారాలు జరిగాయి. కేసీఆర్, కేటీఆర్‌లు కూడా ఆమె కడిగిన ముత్యంలా బయటికి వస్తుందని చెప్పారు. మరోవైపు కవిత కూడా బెయిల్ కోసం ప్రయత్నించినా అది ఫలించడం లేదు. కవిత నేరం చేసినట్లు తమవద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు న్యాయస్థానంలో బలంగా వాదిస్తున్నాయి. దీంతో ఆమె తీహార్ జెల్లోనే మగ్గిపోతున్నారు. అయితే సిబీఐ కేసులో కవితకు జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూకోర్టు మరోసారి పొడిగించింది. జులై 5వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇలా చాలాసార్లు ఆమెకు కోర్టు జ్యూడీషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. అయితే మరికొన్ని రోజుల్లో ఆమె బెయిల్‌పై బయటికి వచ్చే అవకాశం ఉందా.. లేదా సమయం పడుతుందా అనే విషయం కూడా ప్రశ్నార్థకంగా మారింది. లిక్కర్ కేసులో ఇరుకున్న కవిత పరిస్థితి ఎలాంటి మలుపులకు దారితీస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. #brs #kcr #mlc-kavitha #delhi-liquor-scam-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి