నేటితో ఐటీఆర్ ఫైలింగ్ ముగింపు ...ఎంతమంది ఐటీఆర్ ఫైల్ చేశారో తెలుసా?

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువు నేటితో ముగియనున్నది. ఇప్పటికే గడుపు పొడిగిస్తూ వచ్చిన కేంద్రం, ఈ సారి మాత్రం మరోసారి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. జూలై 30వ తేదీ వరకు 6కోట్లకు పైగా ఐటీఆర్ లు దాఖలయ్యాయని ఐటీ శాఖ తెలిపింది.

New Update
నేటితో ఐటీఆర్ ఫైలింగ్ ముగింపు ...ఎంతమంది ఐటీఆర్ ఫైల్ చేశారో తెలుసా?

జూలై 31, 2023 జీతభత్యాలకు చాలా ముఖ్యమైన రోజు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఇదే చివరి రోజు. అయితే చివరి రోజుకు ముందు ఈసారి ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేసిన రికార్డును బద్దలు కొట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, జూలై 30 వరకు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 6 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు అయ్యాయి. ఈ సంఖ్య గతేడాది జూలై 31 వరకు దాఖలు చేసిన ఐటీఆర్‌ల సంఖ్యను దాటినట్లు ఐటీ శాఖ పేర్కొంది.

ఇప్పటి వరకు (జూలై 30) 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని, అందులో ఆదివారం సాయంత్రం 6.30 గంటల వరకు దాదాపు 26.76 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటల వరకు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 1.78 కోట్లకు పైగా లాగిన్స్ వచ్చాయని పేర్కొంది. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు 46 లక్షలకు పైగా విజయవంతమైన 'లాగిన్‌లు' వచ్చాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. శనివారం 1.78 కోట్ల లాగిన్‌లు వచ్చాయని తెలిపింది. అందులో 3.04 లక్షల ఐటీఆర్‌లు గత గంట వ్యవధిలో మాత్రమే దాఖలు అయ్యాయి అని ఆ శాఖ ఆదివారం మధ్యాహ్నం 2.03 గంటలకు ట్వీట్ చేసింది.

అయితే పెద్దెత్తున ఒకసారి ఐటీఆర్ లు ఫైల్ చేస్తుండటంతో చెల్లింపుదారుల నుంచి వెబ్ సైట్ మొరాయిస్తున్నట్లుగా పలు ఫిర్యాదులు వచ్చాయి. అయితే పోర్టల్ బాగానే పనిచేస్తున్నట్లు ఐటీశాఖ తెలిపింది. అయితే పన్ను చెల్లింపుదారులు చివరి వరకు గడువు పొడిగింపు కోసం ఎదురుచూడవద్దని, పెనాల్టీ లేకుండా చెల్లించేందుకు ఐటీఆర్ లను ఫైల చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయనివారు ఆలస్యం చేయకుండా ఆన్ లైన్ లో ఈ విధంగా ఫైల్ చేయండి.

ఆదాయపు పన్ను చెల్లింపు కోసం ఆన్‌లైన్ ప్రక్రియ:

- మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ను ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్ కి లాగిన్ అవ్వండి.

-ప్రధాన డాష్‌బోర్డ్‌ను చేరుకోవడానికి ‘హోమ్’పై క్లిక్ చేయాలి.

-రైట్ సైడ్ ఈ పే ట్యాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.

-ధృవీకరించడానికి మీ పాన్ కార్డు నెంబర్ ను రెండు సార్లు ఎంటర్ చేయండి.

-ఇప్పుడు ఓటిపి కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి.

-మీ అకౌంట్ ను ధృవీకరించడానికి మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.

-ఆదాయపన్ను ఆప్షన్ పై క్లిక్ చేయండి. వివరాలన్నింటిని పూరించండి.

-అసెస్ మెంట్ సంవత్సరాన్ని సెలక్ట్ చేసుకోండి.

-చెల్లింపు ఆప్షన్ ఎంచుకోండి.

-అవసరమైన వివరాలను పూరించిన తర్వాత బ్యాంక్ చెల్లింపు గేట్ వేకి వెళ్తారు.

-లాగిన్ ఐడీ, పాస్ వర్డును ఎంటర్ చేయడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కు లాగిన్ అవ్వండి.

-చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు చెల్లింపు వివరాలను పూరించండి.

-మీ రికార్డుల కోసం చలాన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

-ఇన్ వాయిస్ పీడీఎఫ్ ఫార్మాట్ లో తీసుకోండి.

ఆలస్యంగా చెల్లించినవారికి:
రూ. 5లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేస్తే రూ. 5000వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఆలస్యంగా ఐటీఆర్ పై చేసిన వారికి తక్షణమే రూ. 5000జరిమానా విధిస్తారు. ఇది ఆలస్య కాలంపై ఆధారపడి ఉంటుంది. నెలకు ఒకశాతం అదనపు వడ్డీకూడా వసూలు చేస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు