Bandi vs Etela: సీట్ల కోసం నేతల మధ్య ఆధిపత్య పోరు..తలపట్టుకున్న అధిష్టానం..!! తెలంగాణ బీజేపీలో కొత్త సమస్య తలెత్తింది. ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదర్చలేక అధిష్టానం తలపట్టుకుంటోంది. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బండి సంజయ్‌లు పలు చోట్ల వారి అనుచరులకే టికెట్లు కేటాయించాలంటూ పట్టుపడుతున్నారు. దీంతో కొన్ని సీట్లు అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఇలా ఇద్దరు అగ్రనేతలు మొండికేయడం బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది By Bhoomi 26 Oct 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణ బీజేపీలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇప్పటికే పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. కానీ బీజేపీలో మాత్రం ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. తమ అనుచరులకే సీట్లు కేటాయించాలంటూ ఈటెల రాజేందర్, బండి సంజయ్ లు పట్టుపడుతున్నారు. దీంతో కొన్ని సీట్లు పెండింగ్ లోనే ఉన్నాయి. ఎవరికి వారే తమ అనుచురులకు సీట్ల కేటాయించాలంటూ మొండికేయడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నేతల మధ్య పోరుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడు, హుస్నాబాద్ సీట్లపై ఇంకా స్పష్టత రాలేదు. హుస్నాబాద్ టికెట్ ను తన గురువు కుమారుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఇవ్వలంటూ బండి సంజయ్ పట్టుబడుతున్నారు. అదే టికెట్ ను తన అనుచరుడు జేఎస్ఆర్ కు ఇవ్వలంటూ ఈటెల రాజేందర్ భీష్మించికూర్చున్నారు. అటు వేములవాడ టికెట్ ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు కేటాయించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తుంటే...ఇదే టికెట్ ను తన అనుచరాలు తులా ఉమాకు ఇవ్వాల్సిందేనంటూ ఈటెల రాజేందర్ మొండికేస్తున్నారు. దీంతో ఏటూ తేల్చుకోలేక బీజేపీ పెద్దలు ఇద్దరు నేతలు మధ్య సయోధ్య కుదిర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇది కూడా చదవండి: ఆ సమయంలో రైతుబంధు విడుదల ఆపాలని ఈసీకి కాంగ్రెస్ లేఖ.. భగ్గుమన్న బీఆర్ఎస్..!! అటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు సంబంధించి ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో తమ అనుచరులకే టికెట్లు కేటాయించాలంటూ ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంగారెడ్డి టికెట్టును దేశ్ పాండేకు కేటాయించాలని బండిసంజయ్ పట్టుబడుతున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన నేత ఈ మధ్యే పార్టీలో చేరిన పులిమామిడి రాజుకు టికెట్ కేటాయించాలంటూ ఈటెల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. అటు నారాయణఖేడ్ టికెట్టును తన అనుచరుడైన సంగప్పకు ఇవ్వాల్సిందేంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే మొదటిలిస్టులో సంగప్ప పేరు ఉన్నప్పటికీ ఈటెల రాజేందర్ అభ్యంతరం చెప్పడంతో ఆయన పేరు అధిష్టానం తొలగించింది. ఇదే టికెట్టును గతంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయ్ పాల్ రెడ్డికి కేటాయించాలని ఈటెల రాజేందర్ పట్టుమీదున్నారు. ఇది కూడా చదవండి: ఏ క్షణమైనా ఏపీలో మెగా గ్రూప్-2 నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే? ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఇలా ఇద్దరు అగ్రనేతలు మొండిపట్టుపట్టడం అధిష్టానం అసహనానికి లోనవుతున్నట్లు సమాచారం. సంగారెడ్డి, నారాయణఖేడ్, వేములవాడ, హుస్నాబాద్ ఈ నియోజకవర్గాల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ అనుచరులకే టికెట్లు కేటాయించాలంటూ ఇద్దరు నేతలు డిమాండ్ చేయడం ఇబ్బందిగా మారింది. #sangareddy #husnabad #vemulawada #telangana-politics #telangana-bjp #bandi-vs-etela #narayakhed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి