/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Two-more-days-of-rains-in-AP-and-Telangana.Yellow-warnings-issued-jpg.webp)
Rains In Telangana : ఎండలతో(Heat) అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణశాఖ హైదరాబాద్(Hyderabad) విభాగం చల్లటి కబురు మోసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి అంటే ఆదివారం నుంచి తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు(Rains) కురుస్తాయని అధికారులు వివరించారు. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు.
ఆదివారం నుంచి ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సోమవారం నుంచి ఆదిలాబాద్ కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) ను ఇష్యూ చేసింది.
మరికొన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసినా రాజధాని నగరం లో మాత్రం వానలు పడే అవకాశాలు లేనట్లు స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే తెలంగాణతో పాటు 7,8 తేదీల్లో విదర్భ, చత్తీస్‌గడ్ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ(IMD) వివరించింది. తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు వడగాల్పులు బాగా వీచే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది.
రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకు పైగా నమోదు అవుతాయని అధికారులు తెలిపారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Also read: నేడు , రేపు వడగాలులు వీచే అవకాశాలు… ప్రజలు బయటకు రావొద్దు!