IT Returns: ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నవారికి ముఖ్యమైన సూచన చేసింది ఆదాయపు పన్నుశాఖ (Income Tax Department). ఈ మేరకు కొందరు టాక్స్ పేయర్స్ కు ఇమెయిల్‌లు - SMSలను పంపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సబ్మిట్ చేసిన ఐటీఆర్‌లు వారి ఆర్థిక లావాదేవీల(ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్)తో సరిపోలని పన్ను చెల్లింపుదారులకు ఈ మెసేజ్ లు, మెయిల్స్ పంపిస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో టాక్స్ పేయర్స్ అవగాహన కోసం దీనికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ప్రచారం చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అంటే, ఎవరైనా సబ్మిట్ చేసిన ఐటీఆర్ (IT Returns) వివరాలు.. వారి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తో సరిపోవాలి. అలా సరిపోకపోతే.. ఐటీఆర్ సబ్మిట్ లో తప్పులు చేసినట్టు లెక్క. అందుకే ఐటీఆర్ సబ్మిట్ చేసిన వారు తమ ఫైనాన్షియల్ ట్రాన్సక్షన్స్ తో అది సరిపోయిందా.. లేదా అనే విషయాన్ని వార్షిక సమాచార ప్రకటన (AIS)తో పోల్చుకోవాలి. ఏదైనా తేడాలు ఉంటే కనుక వెంటనే వాటిని సరిచేసుకోవాలి.
ఈపోర్టల్ ద్వారా..
ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక సమాచార ప్రకటన (AIS)ని తనిఖీ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది. నిజానికి AIS ద్వారా రిటర్న్స్లో చేసిన ఏ రకమైన పొరపాటు అయినా గుర్తించే వీలుంటుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినట్టు తెలుసుకుంటే కనుక.. అప్పుడు అప్‌డేట్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసే అవకాశం ఉంటుంది.
ఈ మెసేజ్ ఎందుకు పంపిస్తున్నారు?
ఈ ఇ-క్యాంపెయిన్ లక్ష్యం ITR ఫైలింగ్లో తప్పులను గుర్తించడం జరిగింది అని తెలియచేయడమే అని ఐటీ అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ఇండివిడ్యువల్ టాక్స్ పేయర్స్ అలాగే, సంస్థల అడ్వాన్స్ టాక్స్ లెక్కచేయడం.. తప్పులు లేకుండా ITR సబ్మిట్ చేయడంతో పాటు అడ్వాన్స్ టాక్స్ లో బకాయిలను మార్చి 15 తేదీలోగా జమ చేసేలా చేయడం ఈ మెసేజ్ ల వెనుక ఉన్న ముఖ్యమైన కారణంగా చెబుతున్నారు.
Also Read: పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గేది అప్పుడేనా? ప్రభుత్వం ఏమంటోంది?
సీబీడీటీకి సమాచారం..
2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు - సంస్థలు ఐటీ రిటర్న్స్ (IT Returns)లో ఇచ్చిన నిర్దిష్ట ఆర్థిక లావాదేవీలలో అవకతవకలు జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చెల్లించిన పన్ను ఆధారంగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2024-25) పన్ను చెల్లించని అనేక మంది వ్యక్తులు, సంస్థలను డిపార్ట్‌మెంట్ గుర్తించిందని CBDT తెలిపింది.
ఐటీఆర్‌లో తప్పులను ఎలా సరిదిద్దాలి?
ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ లోని తప్పులను సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. మీ ITRను సరిచేయడానికి లేదా దాని వివరణాత్మక సమాచారాన్ని పొందడానికి, ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా వారి ఇ-ఫైలింగ్ ఖాతాలోకి లాగిన్ చేయడం ద్వారా దాన్ని సరిచేయవచ్చు. దీని కోసం మీరు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం అవసరం. మీరు పోర్టల్‌లో నమోదు కాకపోతే, ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఈ-పోర్టల్‌లో నమోదు చేసుకోండి.