Pan Card: పాన్ కార్డు దుర్వినియోగం.. పాపం ఆ విద్యార్థికి రూ.46 కోట్లకు... మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన ఓ విద్యార్థి పాన్ కార్డు దుర్వినియోగం తో 46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో అతనికి ఐటీ అధికారులు పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో సదరు విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. By Bhavana 30 Mar 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి MP Student Gets Rs 46 Crore Tax Notice: ఓ కాలేజీ విద్యార్థికి జీఎస్టీ అధికారుల నుంచి రూ. 46 కోట్ల కు పన్ను కట్టాలంటూ నోటీసులిచ్చారు. అంతే దెబ్బకి హడలిపోయిన ఆ విద్యార్థి శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు.అసలేం జరిగిందంటే... మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన ప్రమోద్ కుమార్ (Pramod Kumar) దండోటియా కాలేజీలో చదువుతున్నాడు. అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ. 46 కోట్ల లావాదేవీలు జరిగాయని.. అందుకు గానూ అతడు పన్ను చెల్లించాలనేది ఆ నోటీసుల ముఖ్యాంశం. Also Read: పీవీకి భారత్ రత్న… అందుకున్నది ఎవరో తెలుసా దీంతో బెంబెలెత్తిపోయిన ఆ విద్యార్థి సంబంధిత అధికారులను సంప్రదించగా తన పాన్ కార్డు పై ఓ కంపెనీ రిజిస్టార్ అయినట్లు వారు గుర్తించారు. ముంబైతో (Mumbai) పాటు ఢిల్లీ (Delhi) ప్రాంతాల్లో మూడు సంవత్సరాల క్రితం ఆ విద్యార్థి పాన్ కార్డ్ నెంబర్ (Pan Card) తో ఎవరో ఓ కంపెనీ ప్రారంభించి అతని బ్యాంక్ అకౌంట్ నుంచి కోట్లలో లావాదేవీలు జరిపారని విద్యార్థి తెలుసుకున్నాడు. దీంతో అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని , అసలు ఆ కంపెనీ ఏంటో కూడా తనకు తెలియదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విద్యార్థి పాన్ కార్డును గుర్తు తెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి కంపెనీ ని రిజిస్టర్ చేసి... ఆ తర్వాత ఆ అకౌంట్ నుంచి కోట్లలో లావాదేవీలు జరిపారని దీని గురించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. #madhyapradesh #pan-card #company #gwalior మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి