Chandrayaan-3 Sleep: ల్యాండర్, రోవర్ సంకేతాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న ఇస్రో..!!

ల్యాండర్, రోవర్ నుంచి సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 22 నుంచి చంద్రుడిపై సూర్యుడు ప్రకాశించడంతో శాస్త్రవేత్తలు వాటిని యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు 2019లో చైనాకు చెందిన ల్యాండర్ చాంగ్ 4 రోవర్ యుటు 2ను మేల్కోపినట్లు నిపుణులు తెలిపారు. అయితే దక్షిణ ధ్రువంపై పరిస్థితులు వేరని...యాక్టివేట్ పై ఆశలు చాలా తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా విక్రమ్, ప్రజ్ఞాన్ ఆటోమేటిక్‌గా మేల్కొంటాయాని ఇస్రో తెలిపింది.

New Update
Chandrayaan-3 Sleep: ల్యాండర్, రోవర్ సంకేతాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న ఇస్రో..!!

చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై విక్రం ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్నాన్ రోవర్ లు ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అక్కడ పరిశోధనలు చేస్తూ..విలువైన సమాచారాన్ని సేకరించాయి. అంతేకాదు జాబిల్లికి సంబంధించి అరుదైన ఫొటోలను కూడా పంపించాయి. అయితే సెప్టెంబర్ 4 నుంచి చంద్రుడిపై రాత్రి సమయం ప్రారంభం అవ్వడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్నాన్ రోవర్లను ఇస్రో నిద్రావస్థలోకి పంపించింది.

అయితే 15రోుల పాటు నిద్రావస్థలో ఉన్న విక్రమ్ ల్యాండర్ ప్రజ్నార్ రోవర్లు చంద్రుడిపై సూర్యోదయం కాగానే సోలార్ ప్యానెళ్ల తో శక్తిని గ్రహించి మేల్కోవల్సి ఉంటుంది. ఆ దిశగా ఇప్పుడు ఇస్రో ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఇప్పటివరకు ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతోపాటు విక్రమ్ ల్యాండర్, ప్రజ్నాన్ రోవర్ ల నుంచి ఎలాంటి సంకేతాలు ఇస్రోకు అందించలేదు. దాంతో వాటిని మళ్లీ యాక్టివేట్ చేసే కార్యక్రమాన్ని ఇస్రో శనివారం నుంచి మళ్లీ ప్రారంభించనుంది.

ఇది కూడా చదవండి: అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఆఫర్లే ఆఫర్లు.. అదిరే డిస్కౌంట్లు..!!

విక్రమ్ ల్యాండర్, ప్రజ్నాన్ రోవర్ మళ్లీ యాక్టివేట్ చేసే ప్రయత్నాలు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఫలించలేదని ఇస్రో ప్రకటించింది. ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు విక్రమ్ ల్యాండర్, ప్రజ్నాన్ రోవర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. వాటితో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడి వాతావరణాన్ని తట్టుకుని మళ్లీ యాక్టివేట్ చేసేందుకు 50శాతం అవకాశాలు మాత్రమే ఉన్నాయని ఇస్రో వెల్లడించింది.

విక్రమ్ ల్యాండర్, ప్రజ్నాన్ రోవర్ లు తమ బాధ్యతలను ఇప్పటికే పూర్తి చేశామని ఒకవేళ మళ్లీ రివైన్ అయితే..అది బోనసేనని ఇస్రో తెలిపింది. పేలోడ్స్ మళ్లీపని చేయడం ప్రారంభించి...ఏదైనా సమాచారం పంపిస్తే...దాన్ని బోనస్ గా భావించాలని వ్యాఖ్యానించింది. విక్రమ్ ల్యాండర్ ప్రజ్నాన్ రోవర్ లపై ఉన్న సౌర ఫలకలు మళ్లీ విజయవంతంగ చార్జి అయి విక్రమ్ ల్యాండర్ ప్రజ్నాన్ రోవర్ లలోని ఎలక్ట్రానిక్ యంత్ర సామాగ్రి యాక్టివేట్ అయితే మళ్లీ కొన్ని రోజులు అవిచంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలను కొనసాగిస్తాయని తెలియజేస్తుంది.

ఇది కూడా చదవండి: నేడు కాచిగూడు-యశ్వంత్‎పూర్ వందేభారత్ ఎక్స్‎ప్రెస్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు