ISRO: గగన్‌యాన్ మిషన్‌లో కీలక పరీక్షలకు సిద్ధమైన ఇస్రో..

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరో పరీక్షకు సిద్ధమైపోయింది. ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ ప్రోగ్రామ్‌లో వినియోగించేటటువంటి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 వాహకనౌక తొలి పరీక్షను శనివారం నిర్వహించనుంది. అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లేందుకు గగన్‌యాన్‌ మిషన్‌ ప్రయోగాల్లో భాగంగా ఇస్రో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఇందులో భాగంగానే ముందుగా క్రూ మాడ్యూల్‌లోని సిబ్బంది తప్పించుకునే వ్యవస్థ పనితీరును పరీక్షిస్తోంది.

New Update
Gaganyaan Mission:అసలేంటీ గగన్‌యాన్..ఇస్రో ఎందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది?

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమయ్యాక ఇస్రో ఫుల్ జోష్‌లో ఉంది. ఇటీవలే సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్1 మిషన్‌ను పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇస్రో మరో కీలక పరీక్షకు సిద్ధమైపోయింది. ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ ప్రోగ్రామ్‌లో వినియోగించేటటువంటి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 వాహకనౌక తొలి పరీక్షను శనివారం నిర్వహించనుంది. అయితే దీనిద్వారా క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును పరీక్షిస్తారు. మరో విషయం ఏంటంటే ఈ వాహక నౌకకు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే పూర్తైపోయింది. అక్టోబర్ 21 న ఉదయం 8 గంటలకు దీన్ని నింగిలోకి తీసుకెళ్లి.. అందులోని ఉన్న క్రూ మాడ్యూల్ సముద్రంలో పడిపోయేలా చేస్తారు.

అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లేందుకు గగన్‌యాన్‌ మిషన్‌ ప్రయోగాల్లో భాగంగా ఇస్రో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఇందులో భాగంగానే ముందుగా క్రూ మాడ్యూల్‌లోని సిబ్బంది తప్పించుకునే వ్యవస్థ పనితీరును పరీక్షిస్తోంది. అయితే మిషన్‌ ప్రయోగ క్రమంలో ఏదైనా వైఫల్యం వచ్చినట్లైతే దాని నుంచి సిబ్బంది సురక్షితంగా బయటపడాలనే లక్ష్యంతోనే ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. గగన్‌యాన్‌ మిషన్‌ సిద్ధమయ్యే నాటికి ఇలాంటి పరీక్షలు సుమారు 20 వరకు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఒకే ఇంజిన్‌ ఉండే వాహకనౌక.. క్రూ మాడ్యూల్‌, క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ను 17 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత కల్పితంగా అత్యవసర పరిస్థితిని సృష్టిస్తారు. ఇందుకోసం అబార్ట్‌ సిగ్నల్‌ను పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎస్కేప్‌ వ్యవస్థ సరిగ్గా పనిచేసినట్లైతే.. రాకెట్‌ నుంచి క్రూ మాడ్యూల్‌ విడిపోతుంది. ఆ తర్వాత దానికున్న పారాచూట్‌ సాయంతో సముద్రంలో అది పడిపోతుంది. ఆ తర్వాత దాన్ని భారత నౌకాదళం సిబ్బంది దాన్ని ఒడ్డుకు చేరుస్తారు. అయితే ఈ ప్రయోగం మొత్తం 8.5 నిమిషాల వ్యవధిలో పూర్తి అవుతుందని ఇస్రో అధికారులు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు