Chandrayaan-3: రోవర్ మేల్కొనే అవకాశాలు ఉన్నాయి.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోవర్ మళ్లీ క్రియాశీలకంగా మారే అవకాశాలు కొట్టివేయలేమని.. అది నిద్రలేవడంపై ఇప్పటికీ కూడా తమ ఆశలు సజీవంగానే ఉన్నాయని పేర్కొన్నారు. కొచ్చిలోని మలయాళ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Chandrayaan-3: రోవర్ మేల్కొనే అవకాశాలు ఉన్నాయి.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ISRO Somnath about Chandrayaan-3 Pragyan Rover: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేప్టటిన చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతవమై ప్రపంచ దేశాలు భారత్‌ వైపు చూసేలా చేసిన సంగతి తెలిసిందే. చంద్రుని దక్షణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టిన పెట్టిన దేశంగా భారత్ చరిత్రను సృష్టించింది. ఇటీవల అక్కడ 14 రోజుల పాటు ప్రయాణించిన ప్రజ్ఞాన్ రోవర్ కీలకమైన విషయాలను ఇస్రోకు (ISRO) పంపించింది. జాబిల్లి ఉపరితలంపై ఆక్సిజన్‌తో సహా సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది. అయితే 14 రోజులు పూర్తైన తర్వాత ల్యాండర్, రోవర్‌లో నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయాయి.

ఆ తర్వాత మళ్లీ 14 రోజులకు వాటిని మేల్కొలిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. దీంతో కొంత నిరాశ కలిగినప్పటికీ.. రోవర్ కీలక సమాచారం పంపించడంతో అనుకున్న లక్ష్యాలకు చేరుకున్నామని ఇస్రో తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోవర్ (Pragyan Rover) మళ్లీ క్రియాశీలకంగా మారే అవకాశాలు కొట్టివేయలేమని.. అది నిద్రలేవడంపై ఇప్పటికీ కూడా తమ ఆశలు సజీవంగానే ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం కొచ్చిలోని మలయాళ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్ఙంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Also read: ఒత్తిడి చేసి బలవంతంగా సంతకం చేయించారు.. మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం జాబిల్లి ఉపిరతలంపై ప్రజ్ఞాన్ రోవర్ హాయిగా నిద్రిస్తోంది.. ఇప్పడు దాన్ని కదిలించడుండా అలాగే నిద్రపోనిద్దాం. తర్వాత అదే తానంతట తాను మోల్కొనాలని అనుకున్నప్పుడు అది నిద్రలేస్తుంది.. అప్పటిదాక వేచిచూద్దాంమని పేర్కొన్నారు. అలాగే ప్రయోగానికి ముందు కూడా రోవర్‌ను -200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణగ్రత పరీక్షించగా అది పనిచేసిందని.. అందుకే ప్రజ్ఞాన్ మళ్లీ క్రీయాశీలమవుతుందనే నమ్మకం ఉందని తెలిపారు. కానీ విక్రమ్ ల్యాండర్ నిర్మాణం భారీ సైజ్‌లో ఉండటం వల్ల దాన్ని పూర్తిగా పరీక్షించలేకపోయామని చెప్పారు. జులై 14న ప్రయోగించిన తర్వాత 42 రోజుల ప్రయాణంలో బహిర్గతమయ్యే రేడియేషన్, ల్యాండింగ్ సమయంలో అటు ఇటు ఊగిసలాడటంతో.. ప్రజ్ఞాన్ కోలుకోవడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అందుకే దీన్ని అంచనా వేయడం చాలా కష్టమని సోమనాథ్ అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు