Vijay-Rashmika: విజయ్‌ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం..ఫిబ్రవరిలో..?

విజయ్‌ దేవరకొండ, రష్మిక ల నిశ్చితార్థం ఫిబ్రవరిలో జరుగనున్నట్లు ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నట్లు సమాచారం.

New Update
Vijay-Rashmika: విజయ్‌ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం..ఫిబ్రవరిలో..?
Vijay Deverakonda - Rashmika Mandanna: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న లు రిలేషన్‌ షిప్‌ లో ఉన్నారని చాలా కాలం నుంచి రుమార్స్‌ షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరూ అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి టాక్‌ వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆ వదంతులు గురించి ఇరువురిలో ఏ ఒక్కరు కూడా స్పందించలేదు.

ఆన్‌ స్క్రీన్‌ మీదే కాదు..ఆఫ్‌ స్క్రీన్‌ మీద కూడా..

వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్‌ స్క్రీన్‌ మీదే కాకుండా..ఆఫ్‌ స్క్రీన్ మీద కూడా చాలా బాగుంటుందని ఇప్పటికే అభిమానులు చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. తెర మీద కూడా వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఎక్కువే. ఇప్పటికే వీరిద్దరూ సీక్రెట్‌ గా చాలా పార్టీలు, విహారయాత్రలు కలిసి చేసుకున్నారు. పండుగల సమయంలో అయితే రష్మిక విజయ్‌ ఇంట్లోనే ఉంటుందనడానికి చాలా ఫోటోలు సాక్ష్యం. అయితే ఓ సందర్భంలో వీరిద్దరూ కలిసి ఓ లొకేషన్‌ లో దిగిన ఫోటోలను వేరువేరుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వీరిద్దరూ డేటిండ్‌ లో ఉన్నారని అభిమానులు కన్ఫార్మ్‌ చేసేశారు.

ఫిబ్రవరి రెండవ వారంలో నిశ్చితార్థం...

అయితే విజయ్‌ (Vijay Devarakonda) కానీ రష్మిక కానీ ఇప్పటి వరకు ఒక్క సందర్భంలో కూడా వారి డేటింగ్‌ విషయం గురించి స్పందించింది లేదు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. విజయ్‌ రష్మిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఓ జాతీయ మీడియా వివరించింది. ఫిబ్రవరి రెండవ వారంలో విజయ్‌, రష్మిక లు నిశ్చితార్థం (Engagement) చేసుకోబోతున్నారంటూ ప్రచురించింది. దీనికి సంబంధించిన వార్తను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇరు కుటుంబాల వారు మొదలు పెట్టినట్లు సమాచారం. వీరిద్దరి మొదటి సినిమా సమయంలోనే ప్రేమలో పడినట్లు టాక్‌. ఛలో సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన రష్మిక ఆ తరువాత అగ్ర హీరోలందరితో నటించింది. సీతారామం, పుష్ప వంటి హిట్‌ సినిమాలు రష్మిక (Rashmika Mandanna) ఖాతాలో ఉన్నాయి.

బాలీవుడ్‌ లో కూడా భారీ హిట్‌...

కొద్ది రోజుల క్రితమే యానిమల్‌ (Animal Movie) తో బాలీవుడ్‌ లో కూడా భారీ హిట్‌ అందుకుంది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్‌ పుష్ప: ది రూల్‌ షూటింగ్‌ లో బిజీ గా ఉంది. మరోపక్క విజయ్‌ దేవరకొండ కూడా ఫ్యామిలీ స్టార్‌ సినిమా లో నటిస్తున్నాడు. వీరి నిశ్చితార్థం గురించి తెలుసుకున్న వీరి అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. వీరిద్దరికీ విషెస్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే మరి కొందరు మాత్రం ఇది ఫేక్ న్యూస్‌ అంటూ కొట్టి పారేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా సార్లు ఇలాంటి వార్తలు వచ్చాయంటూ పేర్కొంటున్నారు. ఇంతకు ఇది నిజమో కాదో తెలియాలంటే మాత్రం అటు విజయ్‌ కానీ, ఇటు రష్మిక కానీ స్పందించాల్సి ఉంది.

Also read: నన్ను అంతమొందించేందుకు కుట్ర.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు