Big Breaking: కాంగ్రెస్ లోకి వివేక్, రాజగోపాల్ రెడ్డి? తెలంగాణ బీజెపీ కీలక నేతలు వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధం అయ్యారని సమాచారం. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి, ధర్మపురి నుంచి వివేక్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 23 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి అందరూ అనుకున్నట్టుగానే వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డిలు బీజెపీలోంచి బయటకు వచ్చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు. అంతేకాదు వీరిద్దరూ త్వరలో కాంగ్రెస్లో జాయిన్ అవుతారని కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి, వివేక్ అనుకున్న స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారని అందుకే వారిద్దరూ ఆ పార్టీలో జాయిన్ అవనున్నారని అంటున్నారు. Also Read:పండుగల్లో మీ చర్మం మెరిసిపోవాలా..అయితే ఈ టిప్స్ మీకోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెండు అసెంబ్లీ సీట్లు కోరారని సమాచారం. ఎల్ బీ నగర్ , మునుగోడు అసెంబ్లీ స్థానాలను కోమటిరెడ్డి రాజగోపాల్ అడిగారు. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి తన భార్యను బరిలోకి దింపాలని రాజగోపాల్ భావించారు. ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానంనుండి పోటీ చేయాలని రాజగోపాల్ అనుకున్నారని సమాచారం. అయితే బీజెపీ అంుదకు ఒప్పుకోలేదని దానివల్లనే కోమటిరెడ్డి రాజగోపాల్ తొలి జాబితాలో లేదని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అలాగే వివేక్ వెంకటస్వామి చెన్నూరు, ధర్మపురి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి నుండి పోటీ చేయాలని భావించారు. అయితే ఆయనకు చెన్నూరు అసెంబ్లీ కాకుండా ధర్మపురి అసెంబ్లీ స్థానం కావాలని వెంకటస్వామి కోరుకున్నట్టు సమాచారం. కానీ తొలి జాబితాలో ధర్మపురి అసెంబ్లీ స్థానం నుండి ఎస్. కుమార్ ను బీజేపీ బరిలోకి దింపింది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి ఎల్బీ నగర్ నుంచి వివేక్ ధర్మపురి నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. #congress #bjp #komatireddy #vivek మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి