USA: ట్రంప్ హత్యాయత్నం వెనుక ఇరాన్ హస్తముందా?

హత్యకు హత్యే ప్రతీకారమా? ఆమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్‌ ప్లాన్ వేసిందా? అమెరికా నుంచి అందుతున్న నివేదికలు చూస్తే అవుననే అనిపిస్తోంది. జులై 14న పెన్సిల్వేనియాలో డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులు జరగడం.. ఆయన చెవికి తీవ్రంగా గాయాలు కావడం అగ్రరాజ్యంలో ప్రకంపనలు రేపింది.

New Update
USA: బహిరంగ ప్రచారానికి ట్రంప్ దూరం?

Attack On Trump: ట్రంప్‌ను హత్యచేసేందుకే ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చారు. అటు ట్రంప్‌పై కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు చంపేశారు. అయితే ఈ కాల్పుల వెనుక ఇరాన్‌ హస్తముందన్న ప్రచారం జరుగుతోంది.దీనికి అమెరికా నుంచి అందుతున్న నివేదికలు చూస్తే అవుననే అనిపిస్తోంది. ఓ సారి ఫ్లాష్‌ బ్యాక్‌ను గుర్తుచేసుకుందాం.. 2020 జనవరిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాస్సేమ్ సులేమానీ హత్యకు గురయ్యాడు. ఈ హత్య అమెరికా కన్నుసన్నల్లోనే జరిగిందని ఇరాన్‌ గట్టిగా నమ్ముతుంది. నాడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ ఉన్నారు. దీంతో ట్రంప్‌పై ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో అమెరికా ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే క్రమంలో అమెరికా ప్రముఖ మీడియా సంస్థ CNN ఓ కథనాన్ని ప్రచురించింది. ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ ప్లాన్‌ చేసే అవకాశాలున్నాయన్నది ఆ కథనం సారంశం.

అయితే తాజాగా ట్రంప్‌పై జరిగిన దాడికి ఇరాన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ వార్తా కథనం క్లారిటి ఇచ్చింది. మరోవైపు ఇరాన్ కూడా తమ దేశంపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ఎలా రాస్తారని ప్రశ్నించింది. సులేమాని హత్యకు ఆదేశించిన ట్రంప్‌కు న్యాయస్థానంలో శిక్షపడాలని కోరుకుంటున్నట్టుగా చెప్పింది. చట్టపరమైన మార్గంలోనే ముందుకు వెళ్తామని ఇరాన్ స్పష్టం చేసింది.

Also Read:Meta: ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్

Advertisment
Advertisment
తాజా కథనాలు