Tax Rules: దీపావళికి  బోనస్ వచ్చిందా?  టాక్స్ ఎంత కట్టాలో తెలుసా? 

దీపావళికి వచ్చే బోనస్ పై టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆఫీసు నుంచి 50 వేల రూపాయల వరకూ అందుకున్న బోనస్ పై టాక్స్ ఉండదు. అంతకంటే ఎక్కువ అయితే టాక్స్ చెల్లించాలి

New Update
Tax Rules: దీపావళికి  బోనస్ వచ్చిందా?  టాక్స్ ఎంత కట్టాలో తెలుసా? 

Tax Rules: దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీపాలు.. బాణాసంచా సంబరాలు కాకుండా.. ఉద్యోగులకు బోనస్సం (Bonus) తోషాల్ని కూడా తెస్తుంది. అంతేకాకుండా ఈ పండుగ సందర్భంగా బంధువుల నుంచి కానుకలు అందుకోవడమూ జరుగుతుంటుంది. మరి.. ఇలా అందుకున్న బోనస్, బహుమతులపై టాక్స్ ఉంటుందా? ఈ అనుమానం చాలామందికి వస్తుంది. అందుకే ఇప్పుడు మనం బోనస్, బహుమతులపై టాక్స్ రూల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

బహుమతులపై ఎప్పుడు టాక్స్ విధిస్తారు? 

ఆదాయపు పన్ను చట్టంలోని(Tax Rules) సెక్షన్ 56(2) ప్రకారం, రూ. 50,000 వరకు బహుమతులు - నగదుపై టాక్స్ లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. దీపావళి నాడు వచ్చే బహుమతులపై చట్టంలో ప్రత్యేక నిబంధన లేదు. ఆదాయపు పన్ను చట్టంలోని ఈ సెక్షన్ ఏదైనా ఆర్థిక సంవత్సరంలో అందుకున్న అన్ని బహుమతులకు సమానంగా వర్తిస్తుంది.

మీరు ఈ దీపావళికి 30 వేల రూపాయలు బోనస్ గా అందుకుని - మీ పుట్టినరోజున 30 వేల రూపాయల బహుమతిని అందుకున్నారని అనుకుందాం.  అప్పుడు మొత్తం 60 వేల రూపాయలు అవుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ మొత్తం టాక్స్  పరిధిలోకి(Tax Rules) వస్తుంది. ఇప్పుడు అదనంగా వచ్చే రూ.10 వేలపైనే కాకుండా మొత్తం రూ.60 వేలపైనా టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీరు కనుక ఈ బహుమతిని మీ బంధువులు అంటే తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, సోదరుడు, సోదరులు ఇలా ఎవరిదగ్గరనుంచైనా అందుకుంటే, ఆదాయపు పన్ను ఉండదు. 

Also Read: దీపావళికి బంగారం కొనాలంటే ఈ రెండు తేదీలు స్పెషల్.. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయవచ్చంటే..

పండుగల సమయంలో బయటి వ్యక్తులతో కానుకలు ఇచ్చిపుచ్చుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటాం. అటువంటి పరిస్థితిలో, కుటుంబం లేదా దగ్గరి బంధువులు ఇచ్చే బహుమతులపై పన్ను లేదు, కానీ దానిపై పరిమితి కూడా లేదు. మీరు వారితో ఎన్ని ఖరీదైన బహుమతులనైనా ఇచ్చిపుచ్చుకోవచ్చు. అది కూడా ఏ మాత్రం టాక్స్(Tax Rules) గురించి టెన్షన్ లేకుండా. 

ఆఫీసులో అందుకున్న బోనస్‌లు - బహుమతులపై పన్ను

దీపావళికి ఎంతగా ఎదురుచూస్తామో, దీపావళికి వచ్చే బోనస్ కోసం కూడా అంతే ఎదురుచూస్తాం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం, ఆఫీసు నుంచి రూ. 50,000 వరకు పొందిన బహుమతి లేదా బోనస్ పన్ను పరిధిలోకి(Tax Rules) రాదు. కానీ దాని విలువ రూ. 50,000 దాటిన వెంటనే, అది మొత్తం మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో భాగం అవుతుంది. దానిపై టాక్స్ విధిస్తారు. 

Please check this special video:

Advertisment
Advertisment
తాజా కథనాలు