AP Politics: టీడీపీకి షాక్...పాలిటిక్స్ కు గల్లా గుడ్ బై! తాత, కూతురు, మనవడు...ఇలా మూడు తరాలుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న గల్లా ఫ్యామిలీ ఇప్పుడు వాటికి దూరం అవుతున్నారా? అంటే అవుననే చెబుతున్నారు. ఆ కుటుంబం నుంచి ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉన్న గల్లా జయదేవ్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 15 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Galla Jayadev: పాతూరి రాజగోపాల నాయుడు ఫ్రీడయ్ ఫైటర్, రాజకీయవేత్త, కిసాన్ లీడర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (Chandrababu) ఈయన రాజకీయ గురువు. ఈయన కుమార్తె గల్లా అరుణకుమారి (Aruna Kumari) తన తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అరుణ కుమారి భర్త గల్లా రామచంద్రనాయుడు.. అమరరాజా పేరుతో బ్యాటరీ కంపెనీ స్థాపించి చిత్తూరు స్థానికులకు వేలసంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించిన పారిశ్రామికవేత్త. వీరి కుమారుడు గల్లా జయదేవ్ 2014, 2019లో తెలుగుదేశం పార్టీ (TDP) తరఫున గుంటూరు నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. రాజకీయంగా మొదటి నుంచి ఘన చరిత్ర ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. Also read:వైసీపీకి షాక్.. ఈ రోజు టీడీపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు! గల్లా జయదేవ్.. గల్లా అరుణ కుమారి కుమారుడు జయదేవ్...పారిశ్రామిక వేత్త, సూపర్ స్టార్ కృష్ణకు అల్లుడు. గల్లా జయదేవ్..టీడీపీ నేత..గుంటూరు ఎంపీ.. 2014లో తొలిసారి ఎంపీగా గెలిచారు. 2019లో జగన్ వేవ్‌ను కూడా తట్టుకుని రెండోసారి గుంటూరు నుంచే విజయం సాధించారు. అయితే ముచ్చటగా మూడోసారి పోటీకి మాత్రం నో అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ మరింత పుంజుకున్నా, మరోసారి గెలిచే అవకాశం ఉన్నా ఆయన మాత్రం పోటీపై ఆసక్తి చూపించడం లేదని సమాచారం. గత అనుభవాలు, వైసీపీ ప్రభుత్వం తనను, తన వ్యాపారాన్ని టార్గెట్ చేసిన తీరు చూశాక ఆయన పోటీ చేయకుండా ఉంటే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో పాటూ ప్రస్తుత రాజకీయాలు తనకు సరిపడటం లేదని గల్లా జయదేవ్ సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. జిల్లాలోని గల్లా కుటుంబానికి చెందిన కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని, ఆ తరువాత నుంచి జయదేవ్ పొలిటికల్ యాక్టివిటీస్.. తగ్గించారనే ప్రచారం ఉంది. అందుకే గుంటూరు ఛాయలకు కూడా రాకుండా హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారని చెబుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే సభకు వెళ్తున్నారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం తర్వాత కూడా ఆయన టచ్‌మీ నాట్ అన్నట్టు ఉంటున్నారని టాక్ నడుస్తోంది. గల్లా జయదేవ్ తల్లి అరుణ కుమారి 2014లో చంద్రగిరి నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. దాని తర్వాత 2019 ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా కూడా రాజీనామా చేశారు. అయితే అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో అరుణ కుమారి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడు సార్లు మంత్రిగా కూడా చేశారు. అయితే 2014 తర్వాత అరుణ కుమారి రాజకీయాలకు దూరమయ్యారు. #andhra-pradesh #tdp #politics #galla-jayadev #galla-family మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి