IRCTC Retiring Rooms : ట్రైన్ లో టూర్ వెళుతున్నారా? రైల్వే అందించే చౌకైన ఈ వసతి గురించి తెలుసా?

ఒక్కరోజు కోసం ఏదైనా ఊరు వెళితే.. అక్కడ వసతి కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. రైల్వే ప్రయాణీకులకు IRCTC ద్వారా రిటైరింగ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. IRCTC వెబ్సైట్ లేదా యాప్ లో మీ టికెట్ పీఎన్ఆర్ నెంబర్ తో ఈ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవి చాలా చౌకగా లభిస్తాయి.

New Update
IRCTC Retiring Rooms : ట్రైన్ లో టూర్ వెళుతున్నారా? రైల్వే అందించే చౌకైన ఈ వసతి గురించి తెలుసా?

IRCTC :  చాలామంది చిన్న చిన్న పనుల మీద దూరంగా ఉండే ఊర్లకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఒక్కరోజు ఉండాల్సి వచ్చినా.. హోటల్ లో రూమ్ కోసం వేలాదిరూపాయల ఖర్చు అయిపోతాయి. పైగా ఒక్కోసారి హోటల్స్ లో రూమ్స్ కూడా అందుబాటులో ఉందని పరిస్థితి కూడా ఉంటుంది. అయితే రైలులో మీరు ఏదైనా ఊరు వెళితే చౌకలో వసతి సౌకర్యం లభించే అవకాశం ఒకటి ఉంది. ఈ విషయం చాలామందికి తెలీదు. ఇప్పుడు దానిగురించి తెలుసుకుందాం. 

భారతీయ రైల్వే ప్రయాణీకులకు రిటైరింగ్ రూమ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ సదుపాయం IRCTC ద్వారా ఇండియన్ రైల్వేస్ అందిస్తోంది. ఈ సౌకర్యాన్ని ఏ ప్రయాణీకులైనా బుక్ చేసుకోవచ్చు. ప్రయాణీకుల రైలు ఆలస్యమైతే లేదా కొన్ని గంటల తర్వాత అతను మరొక రైలు ఎక్కవలసి వస్తే, రిటైరింగ్ గది అతనికి ఉపయోగపడుతుంది. రిటైరింగ్ గదులు మొబైల్ గదులు కాదు.  కానీ,  ప్రయాణీకులు అక్కడ ఉత్తమ సౌకర్యాలను పొందుతారు. దీని ప్రయోజనం ఏమిటంటే, మీరు కొన్ని గంటల పాటు హోటల్ కోసం వెతకవలసిన అవసరం ఉండదు.  స్టేషన్ చుట్టుపక్కల ఉన్న హోటళ్ల కోసం వెతికితే, అవి ఖరీదైనవిగా ఉంటాయి. అలా అని తక్కువ ధర కలిగిన హోటళ్ల కోసం చూస్తే కనుక అవి చాలా నాసిరకంగా ఉండొచ్చు.  రైల్వే రిటైరింగ్ గదులలో, మీరు రైల్వేలు, పరిశుభ్రత, ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన అనేక ఇతర సౌకర్యాలను నమ్మకంగా పొందే ఛాన్స్ ఉంటుంది. 

ఇది చాలా చౌకగా దొరుకుతుంది.. ఎంతంటే.. 

రిటైరింగ్ గదుల(Retiring Rooms) ధరలు చాలా తక్కువ. ఇక్కడ ధరలు రూ. 100 నుంచి రూ. 700 వరకు ఉంటాయి అలాగే, AC, నాన్-AC గదులను ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.  రిటైరింగ్ రూమ్ బుకింగ్ IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా చేయవచ్చు. ఈ గదులు వేర్వేరు స్టేషన్లలో వేర్వేరు ధరలకు లభిస్తాయి. ఉదాహరణకు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌(New Delhi Railway Station) లో నాన్-ఏసీ గది ధర 12 గంటలకు రూ.150 కాగా, ఏసీ రూం ధర 24 గంటలకు రూ.450. ఇలా ఊరిని బట్టి ధరలు మారుతూ ఉంటాయి.

Also Read: చెన్నైలో సందడిగా ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్.. 

తక్కువ సమయంలో పని ముగించుకుని తిరిగి వెళ్లిపోవాలని అనుకునేటప్పుడు రైల్వే అందిస్తున్న రిటైరింగ్ రూమ్స్ మంచి అవకాశం అని చెప్పవచ్చు. అయితే, కేవలం రైలు ప్రయాణీకులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ట్రైన్ టికెట్ రిజర్వ్ చేసుకున్న తరువాత IRCTC వెబ్‌సైట్ లేదా యాప్ లో రిటైరింగ్ రూమ్స్ ఆప్షన్స్ వద్ద క్లిక్ చేసి రూమ్ బుక్ చేసుకోవచ్చు. దీనికోసం మీ పీఎన్ఆర్ నెంబర్(PNR. No) ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు వెళుతున్న ఊరిలో అందుబాటులో ఉన్న రూమ్స్, వాటి ధరలు కనిపిస్తాయి. వాటిలో మీరు మీ అనుకూలతను బట్టి రూమ్ బుక్ చేసుకోవచ్చు. 

Watch this interesting Video :

Advertisment
Advertisment
తాజా కథనాలు