Cyber Crime: యంగ్‌ ఐపీఎస్‌కు న్యూడ్‌ కాల్‌..ఆ ఆఫీసర్‌ ఏం చేశాడంటే?

New Update
Cyber Crime: నిరుద్యోగులకు రూ.35 కోట్లు  టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు.. అసలేం జరిగిందంటే..

ప్రొబెషనరీలో ఉన్న ఓ ఐపీఎస్‌ అధికారికి తెలియని నంబర్‌ నుంచి వీడియో కాల్‌ వచ్చింది. ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయగా..అవతల వైపు ఓ మహిళ నగ్నంగా ఉంది. దీంతో ఆ అధికారి వెంటనే కాల్ కట్‌ చేశారు. కానీ అప్పటికే అవతలి మహిళ కాల్‌ రికార్డు చేసేసింది. ఆ వీడియో స్క్రీన్‌ షాట్లను అధికారికి పంపి డబ్బులు కావాలని డిమాండ్‌ చేసింది.

దీంతో ప్రొబెషనరీ ఐపీఎస్‌ అధికారి వెంటనే సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ కి ఫిర్యాదు చేశారు. అధికారి నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఢిల్లీలో జరిగింది. వీడియో కాల్‌ స్క్రీన్‌ షాట్లతో ఓ వృద్దుడిని బెదిరించి రూ.13 లక్షలు వసూలు చేసిన ఘటనలో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు.

Also read: తమిళనాడు పీడబ్ల్యూడీ మినిస్టర్ ఇంట్లో ఐటీ దాడులు!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వృద్దునికి జులైలో ఓ వాట్సాప్‌ వీడియో కాల్‌ వచ్చింది. అందులో ఓ మహిళ నగ్నంగా కనిపించింది. దాంతో ఆయన ఫోన్‌ కట్‌ చేశారు. కానీ అప్పటికే వారు కాల్‌ స్క్రీన్‌ షాట్లు తీశారు. బాధితుడి ముఖం కనిపించేలా ఉన్న ఫోటోలను వృద్దునికి పంపారు. వేర్వేరు నెంబర్ల నుంచి అతనికి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.

డబ్బులు ఇవ్వకపోతే ఆ స్క్రీన్‌ షాట్లను సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు. సైబర్‌ క్రైం ఢిల్లీ పోలీసులమని బెదిరించేవారు. కానీ బాధితుడు డబ్బులు ఇవ్వకపోవడానికి ఒప్పుకోలేదు. దీంతో వారు ఆ ఫోటోల్లో ఉన్న మహిళ చనిపోయిందని దానికి కారణం మీరే అంటూ మళ్లీ బాధితుడికి ఫోటోలు పెట్టారు.

దీంతో భయపడిన నిందితుడు వారికి 12 లక్షల 80 వేలు ట్రాన్స్ ఫర్‌ చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు. ఫిర్యాదు ఆధారంగా అల్వార్‌ కి చెందిన ఖాన్‌ ను ముందు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి మూడు మొబైల్‌ ఫోన్లు సిమ్ కార్డుల‌ను రిక‌వ‌ర్ చేశారు.

వీడియో కాల్స్ చేసి జ‌నం నుంచి డ‌బ్బులు వ‌సూల్ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు తేల్చారు.ఈ కేసులో రాజ‌స్థాన్‌ కి చెందిన భ‌ర్కాత్ ఖాన్‌, రిజ్వాన్‌ను సైబ‌ర్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు