IPL: ధోనీ ఫ్యాన్స్‌కు పండుగే.. రిటెన్షన్ లిస్టులో ‘మిస్టర్ కూల్’ ఈ ఐపీఎల్లో ‘మిస్టర్ కూల్’ ఆడుతాడా, లేదా అని సందిగ్ధంలో ఉన్న అభిమానులకు మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన రిటెన్షన్ లిస్ట్‌లో కెప్టెన్‌గా ధోనీ పేరు అలాగే ఉంది. అంటే, ఈ సీజన్ లో కూడా ధోనీ ఫ్యాన్స్ ఇక పండుగ చేసుకుంటారన్నమాట. By Naren Kumar 26 Nov 2023 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి MSD: ధోనీ ఫాన్స్‌కు గుడ్ న్యూస్. మెరుపులాంటి ధనాధన్ ఇన్నింగ్స్‌లను మరికొన్ని రోజులు చూడొచ్చు. అనితరసాధ్యమనిపించే హెలికాప్టర్ షాట్లను ఇంకా ఆస్వాదించొచ్చు. ఛేజింగ్ లో రిక్వైర్డ్ రన్‌రేట్ ఎంతున్నా ‘ధోనీ ఉన్నాడుగా’ అన్న భరోసా ఈ సీజన్ లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ ఐపీఎల్ (IPL)లో ‘మిస్టర్ కూల్’ ఆడుతాడా, లేదా అని సందిగ్ధంలో ఉన్న అభిమానులకు మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రిలీజ్ చేసిన రిటెన్షన్ లిస్ట్‌లో కెప్టెన్‌గా ధోనీ పేరు అలాగే ఉంది. అంటే ఈ బెస్ట్ ఫినిషర్ ఈసారి కూడా గ్రౌండ్ లో తన వ్యూహాలను పారించేందుకు రెడీగా ఉన్నాడనే కదా. ఇక ఈ సీజన్ కూడా ఫాన్స్ కు పండుగే అన్నమాట. ఇది కూడా చదవండి: బోర‘బండ’ బ్రూక్‌కు బై బై.. ఇంటికెళ్లి బొజ్జో బ్రో! లాస్ట్ ఐపీఎల్ టైంలోనే ధోనీ (Dhoni) రిటైర్మెంట్పై చాలా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే తను కూడా బ్యాటింగ్‌కు అంతగా ఆసక్తి చూపినట్లు కనిపించలేదు. ఇతర బ్యాట్స్‌మెన్ అందరినీ ముందకు పంపి తను టెయిలెండర్ల స్థానంలో గ్రౌండ్ లో దిగాడు. ఓ దశలో పరోక్షంగా రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా రిటెన్షన్ లిస్టులో ధోనీ పేరుండడంతో తను ఈసారి ఆడడం ఫిక్సయిపోయినట్లే భావించాలి. సీఎస్కే రిటెన్షన్ లిస్టులోని ప్లేయర్లు: ఎం.ఎస్. ధోని (కెప్టెన్/వికెట్ కీపర్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేశ్ చౌదరి, మతీషా పతిరానా, అజింక్యా రహానే, శక్య రహానే, మిచెల్ సాంట్నర్, సిమర్‌జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ. Yellove Again for the Summer of 2024! 🦁🔜 pic.twitter.com/x8f3d3vvON — Chennai Super Kings (@ChennaiIPL) November 26, 2023 #ipl #csk #msd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి