/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-26T195040.426-jpg.webp)
SRH Vs MI in Uppal Stadium: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా మార్చి 27న ముంబై ఇండియన్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంచనీయా సంఘటనలు జరగకుండా 2,500 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.
ఇవి మాత్రమే అనుమతిస్తాం..
ఈ మేరకు తరుణ్ జోషి మాట్లాడుతూ.. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సీటింగ్ సామర్థ్యం 39 వేలు ఉండగా స్టేడియం లోపల, వెలుపల భారీగా పోలీసులను మోహరిస్తాం. గ్రౌండ్ లోపలికి ల్యాప్ ట్యాప్, వాటర్ బాటిల్స్, బ్యానర్స్, లైటర్స్, సిగరెట్స్, బైనాక్యులర్స్ తీసుకురాకూడదు. బ్లూటూత్స్ మాత్రమే అనుమతిస్తాం' అని స్పష్టం చేశారు.
అలాగే స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్ (She Teams) నిఘా ఉంటుందని చెప్పారు. మ్యాచ్ కు 3 గంటల ముందు నుంచి ప్రేక్షకులను అనుమతిస్తామన్నారు. ముందస్తు భద్రతకోసం 4 అంబులెన్స్‌లు, మెడికల్ టీమ్స్, ఫైర్ ఇంజిన్లను సిద్ధంగా ఉంచబోతున్నట్లు చెప్పారు. అలాగే పార్కింగ్ సదుపాయం కల్పించామని, స్టేడియం వద్ద బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Immitating at the best 🧡😂@ImRo45 pic.twitter.com/mJJuLHJEUr
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) March 26, 2024
ఇది కూడా చదవండి: TSPSC: తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. లిస్ట్ రిలీజ్!
When two telugu guys Meet 🧡#OrangeArmy #SRH #IPL2024 pic.twitter.com/V5eAuyb3MD
— Sunrisers Army (@srhorangearmy) March 26, 2024