IPL Final: టాస్ గెలిచిన సన్ రైజర్స్.. విజయం ఖాయమేనంటున్న ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్!

ఐపీఎల్ సీజన్ 17 తుది పోరులో కోల్ కతా నైట్ రైడర్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. చెన్నై చెపాక్ వేదికగా జరుగుతున్న టైటిల్ పోరులో ఎస్ఆర్ హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లుగానే టాస్ గెలవడంతో విజయం ఖాయమేనంటున్నారు ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్.

New Update
IPL 2024 : సునీల్ నరైన్ Vs నితీష్ రెడ్డి.. బర్త్ డే బాయ్స్ మధ్య ఫైట్..ఫైనల్లో ట్రోఫితో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకునేదెవరు?

IPL Final: ఐపీఎల్ సీజన్ 17 తుది పోరులో కోల్ కతా నైట్ రైడర్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. చెన్నై చెపాక్ వేదికగా జరుగుతున్న టైటిల్ పోరులో ఎస్ఆర్ హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లుగానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో విజయం ఖాయమేనంటున్నారు ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్.

ఇప్పటికే మూడుసార్లు 2009, 16, 18లో ఫైనల్ లో అడుగుపెట్టిన హైదరాబాద్ జట్టు 2009,16లో రెండుసార్లు ఛాంపియన్ గా అవతరించింది. అయితే 2018లో చెన్నై చేతిలో ఫైనల్ పోరులో ఓడిపోయింది. ఈ సీజన్ లో ఫైనల్ లో అడుగుపెట్టడంతో నాలుగోసారి టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఇరుజట్లు బలాలకు సంబంధించి.. సన్ రైజర్స్ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగివుండగా.. బౌలింగ్ విభాగం కూడా అదరగొడుతోంది. ఇక కోల్ కతా విషయానికొస్తే.. అలౌ రౌండర్లకు కొదవలేకపోగా అందరూ అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుండటం జట్టుకు కలిసొచ్చే అంశం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment